జబర్దస్త్‌ యాంకర్‌ తో నందు బొమ్మ బ్లాక్‌ బస్టర్‌

నటుడు, గీతా మాధురి భర్త అయిన నందు హీరోగా బిబి అదేనండి బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ తెరకెక్కబోతుంది.

విశాఖ జిల్లాలోని ఒక గ్రామంలో సాగే కథతో ఈ సినిమా రూపొందబోతున్నట్లగా తెలుస్తోంది.

హైదరాబాద్‌ లో కూడా కీలక సన్నివేశాల చిత్రీకరణ ఉంటుంది.ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ మోషన్‌ పోస్టర్‌కు నందు చేసిన హడావుడితో సినిమా గురించి అంతా చర్చ జరుగుతోంది.

బిబి ఎంటర్‌ టైన్‌మెంట్‌ అనడంతో అందరు కూడా బిగ్‌బాస్‌ అనుకున్నారు.బిగ్‌బాస్‌ ప్రారంభం కాబోతున్న సమయంలో బిబి అంటూ ప్రచారం చేసి మంచి పబ్లిసిటీని తన సినిమాకు తెచ్చుకున్నాడు.

విజయూభవ ఆర్ట్స్‌ బ్యానర్‌ లో రూపొందుతున్న ఈ సినిమాకు రాజ్‌ విరాట్‌ దర్శకత్వం వహిస్తున్నాడు.సినిమాలో నందు పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని అంటున్నారు.

Advertisement

ఇటీవలే ఈయన సవారీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.అందుకే ఈ సినిమా తప్పకుండా ఆయనకు మరో మంచి విజయాన్ని అందిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ఇక బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ గురించిన మరో ఆసక్తికర వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో నందుకు జోడీగా రష్మీ గౌతమ్‌ నటిస్తుందట.బుల్లితెరపై జబర్దస్త్‌ యాంకర్‌ గా పేరు దక్కించుకున్న ఈమె ఇప్పటికే హీరోయిన్‌ గా కొన్ని సినిమాల్లో నటించింది.అయితే కమర్షియల్‌ సక్సెస్‌ లు రాలేదు.

దాంతో అవకాశాలు కాస్త తగ్గాయి.బిగ్రేడ్‌ ఆఫర్స్‌ను కాదంటూ వచ్చిన రష్మీ ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర నచ్చడంతో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందట.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!

ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.యాంకర్‌ రష్మీ ఉంటే సినిమా ఖచ్చితంగా జనాల్లోకి వెళ్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Advertisement

తాజా వార్తలు