తెలంగాణలో కరోనా దడ పుట్టిస్తోంది.రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి.
ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ కేసులు తగ్గుతూ అమాంతం పెరుగుతున్నాయి.రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కరోనా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల సంఖ్య పెంచడంతో రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలల్లో కేసులు నమోదవుతూనే ఉన్నాయి.కేసుల సంఖ్య పెరుగుదలతో పాటు కరోనా బారిన పడి క్యూర్ అయిన వారి సంఖ్య గణనీయంగా నమోదైంది.
ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ కరోనా కేసుల వివరాలకు సంబంధించి బులిటెన్ ను ఆదివారం విడుదల చేసింది.
తెలంగాణ ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,384 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
దీంతో తెలంగాణలో నమోదైన కేసుల సంఖ్య 1,04,248కి చేరిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.ఇందులో ఇప్పటివరకు 80,586 మంది కరోనా నుంచి క్యూర్ అయి డిశ్చార్జ్ అయ్యారు.
ప్రస్తుతం 22,908 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది.గడిచిన 24 గంటల్లో 11 మంది చనిపోయారు.
దీంతో ఇప్పటివరకు కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 755కు చేరింది.నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 1,851 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ ప్రథమ స్థానంలో నిలిచింది.హైదరాబాద్ లో నిన్న ఒక్కరోజే 472 కేసులు నమోదు కాగా, నిజామాబాద్ లో 148 నల్గొండలో 137 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ వెల్లడించింది.







