ఏపీ ప్రభుత్వ ప్రయాణికులకు శుభవార్తను అందించింది.బస్సుల్లో ప్రయాణించే వారు గతంలో రిజర్వేషన్ చేసుకునేందుకు వారం రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకునే వారు.
కానీ ప్రభుత్వం ఇప్పుడు ఆ సమయాన్ని 30 రోజులకు పెంచింది.దీంతో ప్రయాణికులు ఈజీగా నెల రోజుల ముందు నుంచే రిజర్వేషన్ చేసుకోవచ్చు.
ఈ సదుపాయాన్ని వెంటనే అమలు చేయబోతుందని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ పేర్కొన్నారు.కరోనా నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు మాత్రమే బస్సులు నడిపిస్తున్నారు.
అంతర్ రాష్ట్ర సర్వీసులపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు ఎండీ తెలిపారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.
అయితే అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అంతర్రాష్ట్ర సేవలు పునరుద్ధరించాలని కోరుతూ కేంద్ర రవాణాశాఖకు లేఖను కూడా రాయడం జరిగింది.ఈ మేరకు కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది.
త్వరలోనే అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది.అయితే కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు జాగ్రత్త వహించాలని కేంద్రం సూచిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ కూడా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.అంతర్రాష్ట్ర బస్సు సేవలు ప్రారంభం అయితే లాక్ డౌన్ లో వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్నరాష్ట్ర ప్రజలకు సొంతూళ్లకు చేరుకోవచ్చు.