మీ పిల్లలు స్మార్ట్‌ ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా...? కాస్త జాగ్రత్త సుమా...!

ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండే ఉంటుంది.

ఇదివరకు పిల్లలకు అన్నం తినాలంటే ఆ కథ, ఈ కథ చెప్పి అన్నం తినిపించే వారు.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.తల్లిదండ్రులు వారి పనిలో వారు ఉండడానికి పిల్లలకి స్మార్ట్ ఫోన్ ను అలవాటు చేస్తున్న రోజులివి.

ఇక మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకు మూడు, నాలుగు సంవత్సరాలకే వారి కోసం అని ఒక ఫోన్ సపరేట్ గా తీసుకుంటున్నారు అంటే చిన్న పిల్లలు స్మార్ట్ ఫోన్ కు ఎంత బానిసలు అయ్యారో ఇట్టే అర్థమవుతుంది.ఇకపోతే తాజాగా కమ్యూనికేషన్ రంగ నిపుణులు తల్లిదండ్రులకు కొన్ని సూచనలు ఇస్తున్నారు.

ఎనిమిది సంవత్సరాలు దాటిన పిల్లలకు మాత్రమే మొబైల్ ఫోన్లను ఇవ్వాలని వారు సూచిస్తున్నారు.తాజాగా కొంతమంది రెండు సంవత్సరాలు నిండని పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చి దానిని ఆటబొమ్మగా చేస్తున్నారని అది వారి మానసిక శారీరక ఆరోగ్య పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

ఇక తాజాగా కరోనా వైరస్ నేపథ్యంలో పాఠశాలలకు పిల్లలు పోలేకపోవడంతో వారందరికీ ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఆన్లైన్ క్లాసులు కూడా కేవలం ఎనిమిది సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే క్లాసులు వర్తింపజేయాలని సూచిస్తున్నారు.

అది కూడా కేవలం గంట కన్న ఎక్కువ సేపు ఆన్లైన్ లో క్లాసులు ఉండకుండా చూసుకోవాలని వారు సూచిస్తున్నారు.

సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం ద్వారా వారు చిన్నప్పటినుంచే పెంపొందించుకోవాల్సిన ఆలోచనా శక్తిని వారు కోల్పోతున్నారని హెచ్చరిస్తున్నారు.కాబట్టి ఒకవేళ పిల్లలకు ఇవ్వాల్సి వచ్చిన కేవలం చాలా తక్కువ సమయం మాత్రమే అందించే విధంగా చూసుకోవాలి అంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు.ఇక కొందరు వైద్యులు ఇలా చిన్న వయసులోనే సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం ద్వారా జ్ఞాపకశక్తి తగ్గడం అసహనం చిరాకు శారీరక ప్రేమకు దూరం కావడం లాంటి పలు రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తల్లిదండ్రులకు తెలియజేస్తారు.

అంతేకాదు పిల్లలు కచ్చితంగా 8 గంటల సమయం నిద్రపోయేలా చూసుకోవాలని తల్లిదండ్రులను వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఈ మధ్యకాలంలో కొంతమంది కేవలం ఆరు సంవత్సరాల నుండి కంప్యూటర్ కోడింగ్ తరగతులు నిర్వహిస్తామన్నారు కొన్ని కంపెనీలు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇక ఇలాంటి దారుణాలు ఫ్యూచర్ లో ఎన్ని చూడాల్సి వస్తుందో మరి.

Advertisement

తాజా వార్తలు