ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో దారుణం..!

దేశ వ్యాప్తంగా శర వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ బారిన పడి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

కొందరూ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా లేక ప్రాణాలు కోల్పోతున్నారు.

మరికొందరూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు వదులు తున్నారు.ఉన్న పేషంట్లను పట్టించుకోవడం మర్చిపోతున్నారు.

రిపోర్టులు తారుమారు అయి కుటుంబసభ్యులు మృతుల ముఖం కూడా చూడటానికి నోచుకోని పరిస్థితి నెలకొంటుంది.కరోనా పేషంట్ల పట్ల వైద్య సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కొన్ని చోట్లలో వెలుగు చూస్తున్న ఘటనలే నిదర్శనం.

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది.కోవిడ్-19 పరీక్షలు నిర్వహించిన తర్వాత డాక్టర్లు కుటుంబ సభ్యులకు సంప్రదించి డిశ్చార్జ్ చేస్తున్నామని చెప్పారు.దీంతో బంధువులు అక్కడి చేరుకుని అధికారులకు తెలపడంతో డాక్టర్లు బాధితురాలు కనిపించడంలేదని వెల్లడించారు.

Advertisement

తర్వాత రికార్డులు పరిశీలించగా అప్పటికే బాధితురాలు మరణించిందని తెలిపారు.దీంతో కుటుంబ సభ్యులు వాపోయారు.

పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం, కూచుంపూడి గ్రామానికి చెందిన కళాతోటి అన్నపూర్ణకు కరోనా సోకింది.దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఈ నెల 13వ తేదీన ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.

కరోనాతో చికిత్స పొందుతూ వైరస్ నుంచి కోలుకుందని చెప్పారు డాక్టర్లు.మూడ్రోజుల కిందట ఫోన్ చేసి ఆమెను డిశ్చార్జ్ చేస్తున్నామని తెలిపారు.

దాంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చినా ఈ రోజు డిశ్చార్జ్ చేయలేదు.శనివారం బాధితురాలి కుమారుడు డాక్టర్లకు ఫోస్ చేసి డిశ్చార్జ్ చేస్తారా అని అడిగినప్పుడు ఈ రోజు చేస్తామని చెప్పారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తీరా కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్న తర్వాత ఆస్పత్రి పొంతన లేని సమాధానాలు చెప్పారు.బాధితురాలు కనిపించడంలేదని, రిపోర్టులు చూశాక అన్నపూర్ణ మరణించిందని వెల్లడించారు.

Advertisement

కనీసం మృత దేహాన్ని చూపించాలని అడిగినప్పుడు కుదరదని డాక్టర్లు చెప్పడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు అధికారులపై మండిపడ్డారు.

తాజా వార్తలు