బిచ్చగాడు సీక్వెల్ రంగం సిద్ధం... జూలై 24 ఫస్ట్ లుక్

నాలుగేళ్ల క్రితం వచ్చిన బిచ్చగాడు సినిమా ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.

ఈ సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి అంచనాలకి మించి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని విజయ్ అంటోనీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో అతనికి సాలిడ్ హిట్ ఇచ్చి నిర్మాతగానూ లాభాలు తెచ్చిపెట్టింది.

ఇక తెలుగులో ఈ సినిమాని డబ్బింగ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.తమిళంలో కంటే ఎక్కువ కలెక్షన్స్ తెలుగులో ఈ సినిమాకి వచ్చాయంటే బిచ్చగాడు సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎంతగా ఇష్టపడ్డారో తెలుసుకోవచ్చు.

అమ్మ సెంటిమెంట్ సినిమా రేంజ్ ను ప‌తాక స్థాయికి తీసుకెళ్లింది.ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది.

ఈ సినిమా కోసం నటుడు విజయ్‌ అంటోనీ స్టోరీ రైట‌ర్ గా కూడా మారిపోయాడు.ఇప్పటికే సంగీత దర్శకుడుగా, హీరోగా, నిర్మాతగా తన సినిమాలకి బాధ్యతలు నిర్వహిస్తున్న విజయ్ అంటోనీ ఇప్పుడు ఈ సీక్వెల్ ద్వారా తనలో మరో టాలెంట్ ని బయటకి తీసాడు.

Advertisement

బిచ్చగాడు సీక్వెల్ పై ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుండగా తాజాగా విజయ్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు.జూలై 24న విజ‌య్ ఆంటోని బ‌ర్త్‌డే కావ‌డంతో ఆ రోజు చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేస్తార‌ట‌.

సినిమాకి సంబంధించి పూర్తి వివ‌రాలు కూడా అదే రోజు వెల్ల‌డిస్తార‌ని తెలుస్తుంది.బిచ్చ‌గాడు సీక్వెల్ కూడా విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించి సంగీత అందిస్తాడు.

దర్శకత్వం ఎవరనేది జులై 24న తెలుస్తుంది.మరి మొదటి సినిమా స్థాయిలో ఈ సీక్వెల్ ఎంత వరకు సూపర్ హిట్ అయ్యి మళ్ళీ విజయ్ అంటోనీకి సాలిడ్ సక్సెస్ ఇస్తుంది అనేది చూడాలి.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు