మాస్క్ ధరించిన ట్రంప్...ఎన్నికలా మజాకానా..!!

అమెరికా అధ్యక్ష ఎన్నికల మజాకానా.ఎలాంటి వాళ్లైనా ప్రజా స్వామ్యం ముందు తలవచాల్సిందే అఫ్కోర్స్ ఎన్నికలు జరగక ముందు వరకే అనుకోండి.

ఒక సారి ఎన్నికలు అయితే ఇక వ్యవహారం మామూలే.సరే అసలు విషయం ఏమిటంటే.

అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది.మరో పక్క ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండటానికి అమెరికా ప్రభుత్వం మాస్క్ లు ధరించమని, సామాజిక దూరం పాటించమని ఇవే కరోన నుంచీ మనల్ని మనం కాపాడుకోవడానికి ఉపయోగపడుతాయని సూచనలు చేసింది.

అయితే ఈ ఆదేశాలు జారీ చేసిన అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ముఖానికి మాస్క్ ధరించకుండా ఉండటంతో పెద్ద దుమారమే లేచింది.అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నారు, మాస్క్ అధ్యక్షుడే ధరించకపోతే సామాన్య ప్రజలు ఎలా ఈ నిభందనలు పాటిస్తారని ప్రజా సంఘాలు దుయ్యబట్టాయి.

Advertisement

సోషల్ మీడియాలో ట్రంప్ వ్యవహార శైలిపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెలువడుతున్నాయి.ఇదిలాఉంటే ఇదే అదనుగా చేసుకున్న డెమోక్రటిక్ పార్టీ ట్రంప్ మాస్క్ ధరించక పోవడాన్ని పెద్ద రాజకీయం చేయడమే కాకుండా అమెరికన్స్ కి ట్రంప్ పై విసుగు తెప్పించేలా చేసింది.

దాంతో ప్రతిపక్ష పార్టీ చేస్తున్న రాజకీయాన్ని గ్రహించిన ట్రంప్.పలు మార్లు వైట్ హౌస్ సెక్రెటరీలతో మాస్క్ ధరించడానికి ట్రంప్ కి ఎలాంటి ఇబ్బందులు లేవని పరిస్థితులు ద్ చేస్తే మస్క్ తప్పనిసారిగా ధరిస్తారని ప్రకటించారు.అంతేకాదు

మరో 4 నెలలలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో లేని పోని తలనెప్పులు ఎందుకు అనుకున్నారో ఏమో కాని ట్రంప్ ఎట్టకేలకి కరోన వచ్చిన ఇన్ని రోజుల తరువాత ముఖానికి మాస్క్ ధరించి కనపడ్డారు.వాల్ట్ రీడ్ నేషనల్ మిలటరీ సెంటర్ ని సందర్శించిన తరుణంలో ఇలా మాస్క్ ధరించి కనపడటం అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది.ట్రంప్ సన్నిహితులు మాత్రం ప్రజలలో ప్రేరణ కలిగించడానికి ట్రంప్ మాస్క్ ధరించారని అంటున్నా.

ఎన్నికలు దగ్గరపడటంతోనే ట్రంప్ మాస్క్ ధరించారని ప్రజల ఆగ్రహానికి లోనవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారని డెమోక్రటిక్ పార్టీ ఎద్దేవా చేస్తోంది.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు