సుశాంత్ పేరు మీద ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్న తండ్రి

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

అతని ఆత్మహత్యకి డిప్రెషన్ కారణం అని పోలీసులు తేల్చేసిన కూడా ఆ డిప్రెషన్ కి కారణం బాలీవుడ్ ఇండస్ట్రీని మాఫియాలా శాసిస్తున్న కొంత మంది పెద్దలు.

బాలీవుడ్ లో ఉన్న వారసులు అని విమర్శలు పెద్ద ఎత్తున వినిపించాయి.అయితే ఈ విమర్శలు ఎలా ఉన్న కూడా ఇప్పుడు సుశాంత్ మరణం అనేది అతని కుటుంబం సభ్యులకి తీవ్ర విషాదం మిగిల్చింది అని చెప్పాలి.

అయిన కూడా మనో నిబ్బరం చేసుకొని సుశాంత్ జ్ఞాపకంగా అతని కుటుంబ సభ్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.తన కుమారుడి పేరిట సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తున్నట్టు తండ్రి కృష్ణకుమార్ సింగ్ వెల్లడించారు.

ఈ ఫౌండేషన్ ద్వారా ప్రతిభావంతులను ప్రోత్సహిస్తామని, సినిమా రంగంలోనే కాకుండా, క్రీడలు, సైన్స్ రంగాల్లోనూ ఈ ఫౌండేషన్ సేవలు అందిస్తుందని వివరించారు.సుశాంత్ కు ఈ మూడు రంగాలంటే ఎంతో ఇష్టమని తెలిపారు.

Advertisement

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రపంచం తమకు ఓ గులాబీ వనం లాంటిదని, ఆ పూదోటలో సుశాంత్ ఓ అందమైన గులాబీ అని, కల్మషం లేకుండా మాట్లాడేవాడని అన్నారు.కాగా, పాట్నాలోని నివాసాన్ని సుశాంత్ స్మారక ప్రదేశంగా ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు.

సుశాంత్ గురించి సానుభూతిగా మాట్లాడుతున్న అందరూ రేపటి రోజున మరిచిపోయి మళ్ళీ ఎవరి జీవితాలలో వారు పరుగులు పెడతారు.సుశాంత్ ని మరిచిపోతారు.

కాని ఫ్యామిలీ మాత్రం అతనికోసం ఒక ఫౌండేషన్ పెట్టడం నిజంగా గొప్ప విషయం.

సొంత ఇంటి కల నెరవేర్చుకున్న బిగ్ బాస్ బ్యూటీ శోభ.. ఫోటోలు వైరల్!
Advertisement

తాజా వార్తలు