జులై 31వ తారీఖు వరకూ మళ్ళీ లాక్ డౌన్... 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్  విధించడంతో పాటు ప్రజలను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

అయితే కొంత మంది ప్రజలు మాత్రం ప్రభుత్వం విధించినటువంటి నిబంధనలను నిర్లక్ష్యం చేయడంతో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి.

దీంతో మరోమారు లాక్  డౌన్ వచ్చే నెల 31 వ తారీకు వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.ఇందులో భాగంగా ఎవరైనా సరే లాక్ డౌన్ నిబంధనల ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజలకు తెలియజేశారు.

అలాగే ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని ఒకవేళ వచ్చినా కూడా మాస్కులు ధరించి రావాలని లేకపోతే ఇతరులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కాబట్టి మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.అలాగే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్దీ కాలంగా నమోదుయినటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.

అయితే ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదయినటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల గణాంకాలను పరిశీలించినట్లయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 14723  పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇందులో 580 మంది మృత్యువాత పడ్డారు.

Advertisement
నాగార్జున 100 వ సినిమా కథను అందిస్తున్న యంగ్ రైటర్స్...

తాజా వార్తలు