ఆ దుకాణాల్లో వ్యాపారులు ఉండరు... మీకు ఇష్టమైనవి తీసుకెళ్ళచ్చు ...!

ప్రస్తుత రోజుల్లో అందరూ ఉండగానే కావలసినవి కొట్టి లాక్కుని వెళ్లే రోజులివి.అయితే ఓ చోట మాత్రం దుకాణాలు ఉంటాయి, అందులో సరుకులు కూడా అమ్ముతారు.

కాకపోతే వాటిని అమ్మేవారు మాత్రం అక్కడ కనిపించారు.మరి ఆ దుకాణంలోని సరుకులను కొనుగోలు చేయాలంటే ఎలా.? వస్తువులని అక్కడ వదిలేస్తే ఎవరైనా దొంగలు తీసుకెళతారన్న సందేహం.లాంటివి అక్కడ అ ఏవి కనిపించవు.

దానికి కారణం అక్కడ వారి నమ్మకం మాత్రమే.ఆ ప్రాంతంలోని ప్రజలు తమకు ఏ వస్తువులు కావాలన్నా ఆ దుకాణం ముందు ఏర్పాటు చేసిన ధరల పట్టికను చూసి వాటికి సరిపడు సొమ్మును చెల్లిస్తే సరిపోతుంది.

వారికి కావలసిన వస్తువులను తీసుకున్న తర్వాత ఆ సరుకులకు సరిపడా మొత్తాన్ని అక్కడి ఉంచి వెళ్లిన డిబ్బీ లో వేస్తే సరిపోతుంది.ఒకవేళ డబ్బులు ఇవ్వకుండా సరుకులు తీసుకువెళ్లిన కూడా అక్కడ ఎవరూ ఏమీ అనరు.

Advertisement

దానికి కారణం అక్కడి ప్రజలు అలా చేయరని దుకాణదారుల నమ్మకం.అలాగే అక్కడి ప్రజలు కూడా అలా చేయడం తప్పని వారికి బాగా తెలుసు.

కాకపోతే ఇలాంటి ప్రాంతం ఎక్కడ ఉందని అనుకుంటున్నారా.? ప్రపంచంలో ఎక్కడో కాదండి మన భారతదేశంలోని మిజోరం రాష్ట్రంలోనే ఇలాంటి వ్యాపారం కొనసాగుతోంది. మిజోరాం రాజధాని ఐజ్వాల్ సమీపంలోని గ్రామాల్లో ఇలాంటి దుకాణాలు చాలా కనిపిస్తాయి.

ఈ సాంప్రదాయాన్ని అక్కడి ప్రజలు ‘నాగహా లో డావర్’ అని పిలుస్తారు.

ఇక అక్కడి దుకాణ యజమానులు ఉదయాన్నే వచ్చి వారు అమ్మే సరుకులను దుకాణాల్లో పెట్టేసి వెళ్ళిపోతారు.అలాగే అక్కడ డబ్బులు వేసేందుకు ఓ డబ్బా ఉంచుతారు.ఇలా మళ్లీ సాయంత్రం కాలం వేళ దుకాణ యజమానులు వచ్చి అందులోని డబ్బు తీసుకువెళ్తారు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

ఇలా డబ్బులు, వస్తువులు అన్ని ఆరుబయట వదిలేసిన అక్కడ దొంగతనాలు జరగవట.గత మూడు నెలల్లో ఈ దుకాణాలు ఎంతగానో ప్రజలకు ఉపయోగపడ్డాయి.ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా వారికి కావలసిన నిత్యావసర వస్తువులను అక్కడ తక్కువ ధరకు కొనుగోలు చేశారు.

Advertisement

ఈ నేపథ్యంలో మిజోరాం ప్రభుత్వం ఇలాంటి దుకాణాలను మరిన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది.ఇలాంటి మంచి సాంప్రదాయం నచ్చడంతో మణిపూర్ రాష్ట్రంలో కూడా ఇలాంటి దుకాణాలను ఏర్పాటు చేయాలని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

తాజా వార్తలు