అమెరికాలో ఎన్నికలకి ఎంతో సమయం లేదు.మరో 5 నెలలలో అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి.
ఈ నేపధ్యంలో మళ్ళీ అధికారంలోకి రావడానికి రిపబ్లికన్ పార్టీ ఉవ్విళ్ళురుతోంది.ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడిగా విషయం సాధించుతారని భావించిన పార్టీ మళ్ళీ అధ్యక్షుడిగా ట్రంప్ నే ఖరారు చేసింది.
అయితే ఈ సారైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని డెమోక్రటిక్ పార్టీ విశ్వప్రయత్నాలు చేస్తోంది.ఈ క్రమంలోనే డెమోక్రటిక్ పార్టీ సీనియర్ లీడర్స్ ప్రచారం మొదలు పెట్టారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా డెమోక్రటి పార్టీని గెలిపించడానికి యూట్యూబ్ ద్వారా ప్రచారం మొదలు పెట్టారు.మార్పు కోసం ఓటు వేయండి అంటూ ఒబామా చేపట్టిన ప్రచారం అందరిని ఆలోచింప చేస్తోంది.
ఒక్క ఓటు అమెరికా ప్రజల జీవితాలని మార్చుతుంది.అమెరికాని మళ్ళీ ఉన్నతమైన స్థానంలో ఉంచుతుందని యూట్యూబ్ ద్వారా అమెరికా ప్రజలకి సందేసం ఇచ్చారు.
అంతేకాదు తనదైన మాటలతో ప్రజలని చైత్యన పరుస్తున్నారు.

రెండు వారాల నుంచీ జాతి వివక్షత పై జరుగుతున్న నిరసనలు న్యాయం చేయలేవని అందుకు మార్పు ఎంతో అవసరమని తెలిపారు.అమెరికాలో ప్రజా స్వామ్యం పతనావస్థలో ఉందని దాని బ్రతికించుకోవాలంటే యువత ముందుకు రావాలని ఓటు ద్వార సమాధానం చెప్పాలని అన్నారు.అంతేకాదు కరోనా వైరస్ ని ప్రభుత్వం ఎదుర్కున్న తీరు ఫలితాలని ఇవ్వకపోగా తీరని నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒబామా ఇదే తీరులో ప్రచారం చేపడితే ట్రంప్ ఇంటికెళ్లడం ఖాయమనే అంటున్నారు నిపుణులు.