కిమ్ చనిపోవాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారా...?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ కారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఈ మధ్యకాలంలో మీడియా ముందుకు రావడం మానేసాడు.

అంతేగాక తన ఆరోగ్యం గురించి ఎటువంటి వార్తలను బయటకు రానివ్వకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడు.దీంతో ప్రస్తుతం కిమ్ జోంగ్ ఉన్ కి సంబంధించినటువంటి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇందులో ఎక్కువగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోవాలని ఎక్కువమంది ప్రజలు కోరుకుంటున్నారు.అంతేగాక కిమ్ రాక్షస పాలన అంతం అవ్వాలని ఆ దేశ యువత దీనంగా దైవాన్ని వేడుకుంటున్నారు.

కిమ్ ఆంక్షల పేరుతో ప్రజల పట్ల తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారని అది ఏమాత్రం సరికాదని పలువురు దేశంలోని ప్రముఖుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనీసం కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యంతో మరణిస్తే ఈ నియంత పాలన అంతమవుతుందని కిమ్ మరణం కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

కిమ్ తన అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకే దేశంలో ఎక్కువగా మీడియా చానెళ్లను కూడా తన ఆధీనంలో ఉంచుకున్నాడు.ఒకవేళ ఏదైనా మీడియా చానల్ తనకు వ్యతిరేకంగా వార్తలను తెలియజేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేవాడు.

దాంతో కేవలం కిమ్ కి సంబంధించిన మంచి విషయాలను మాత్రమే ప్రజలకు తెలియజేసేవారు.అంతేగాక మానవ జీవితంలో ఎంతో కీలకమైన టువంటి ఇంటర్నెట్ కూడా ఉత్తర కొరియాలో అందరికీ అందుబాటులో ఉండదు.

కేవలం సమాజంలో డబ్బు, పరపతి ఉన్నటువంటి ప్రముఖులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు కిమ్ పాలన ఎంత నరకంగా ఉంటుందో అని.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు