ఆ సమయంలో శానిటైజర్ వాడొద్దు అంటూ ఆర్మీ పిలుపు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ మహమ్మారి అనేది ఇతరులకు వ్యాపించకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ మాస్క్ లు అలానే చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అంటూ సూచనలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే చాలా మంది చేతులకు హైజినిక్ గా ఉంచడం కోసం అని హ్యాండ్ శానిటైజర్ల ను కూడా వినియోగిస్తున్నారు.అయితే ఆల్కహాల్ తో తయారు చేసిన ఈ హ్యాండ్ శానిటైజర్లు చాలా ప్రమాదకరమని సోషల్ మీడియా లో చాలా వీడియో లు హల్ చల్ చేస్తున్నాయి.

అయితే ఈ నెల 5 వ తేదీ(ఆదివారం) రాత్రి 9 గంటలకు లైట్ లను బంద్ చేసి 9 నిమిషాల పాటు కొవ్వొత్తి,దీపం,టార్చ్ లైట్ లేదా మొబైల్ ఫ్లాష్ లైట్ రూపంలో దీపాలు వెలిగించి అందరి దృఢ సంకల్పాన్ని తెలియజేయాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.శుక్రవారం వీడియో ద్వారా మోడీ ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు.

ఈ 11 రోజులు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి అని,ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రతి ఒక్కరూ ఇలా లైట్ లను వెలిగించి తమ సంఘీభావం తెలపాలి అంటూ కోరారు.అయితే ఈ సమయంలో ఎవరూ కూడా హ్యాండ్ శానిటైజర్లు ఉపయోగించవద్దు అంటూ భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.75 శతం ఆల్కహాల్ తో తయారైన శానిటైజర్ల ను ఉపయోగించినప్పుడు మీ చుట్టూ అగ్నితో సంబంధం ఉన్న వాటికి దూరంగా ఉండాలి.

Advertisement

మండే వాటికి దగ్గరగా వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు మంటలు చెలరేగే అవకాశం ఉందని కావున ఆ సమయంలో శానిటైజర్లు అనేవి ఉపగించకపోవడం మంచిది అంటూ ఆర్మీ కోరింది.ఏప్రిల్‌ 5న రాత్రి కొవ్వొత్తులు, దీపాలు వెలిగించేముందు తగిన జాగ్రత్తలు తీసుకోండి.దీపాలు వెలిగించే ముందు చేతులను ఆల్కహాల్‌తో తయారైన శానిటైజర్లతో కాకుండా సబ్బులతో చేతులను శుభ్రంగా కడుక్కోని వాటిని వెలిగించాలి అంటూ ప్రజలను ఉద్దేశించి ఇండియన్‌ ఆర్మీ తన ప్రకటన లో సూచించింది.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు