మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటి వరకు ఏపీలో పరిస్థితి అదుపులో ఉన్నట్లు గానే కనిపించినా , అకస్మాత్తుగా ఏపీలో పరిస్థితి చేజారి పోతున్నట్టుగా కనిపిస్తోంది.ఒక్క రోజులోనే సుమారు 17 వరకు పాజిటివ్ కేసులు నమోదు కావడం వారంతా ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారే.
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసుల సంఖ్య 50 కి చేరుకుంది.ఎక్కువగా పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది.
మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో పరిస్థితి మెరుగ్గానే ఉంటూ వచ్చింది.ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ సమర్థవంతంగా ముందస్తు జాగ్రత్తలు నిర్వహించింది.
అయినా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన చెందుతోంది.

ఢిల్లీ మత ప్రార్థనకు వెళ్లిన వారిలో జిల్లాల వారీగా చూసుకుంటే మొత్తం 711 మంది వివరాలను ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.వారంతా త్వరగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేయించుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.పశ్చిమగోదావరి జిల్లాలో 16 మంది , విశాఖపట్నంలో 41మంది, విజయనగరం జిల్లాలో ముగ్గురు, విశాఖ రూరల్ ఒక్కరు, కృష్ణా జిల్లాలో 16, విజయవాడ సిటీ లో 27 మంది, గుంటూరు అర్బన్ 45 మంది, గుంటూరు రూరల్ 43 మంది, ప్రకాశం జిల్లాలో 62 మంది, నెల్లూరు జిల్లాలో 68 మంది, కర్నూలు జిల్లాలో 189 మంది, కడప జిల్లాలో 59 మంది, అనంతపురం జిల్లాలో 73 మంది, చిత్తూరులో 20 మంది, తిరుపతికి చెందిన 16 మంది ఢిల్లీకి వెళ్లారు.
అయితే వీరు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత కరోనా పరీక్షలు చేయించుకోవడం పై పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.వారు ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు వైరస్ ను అంటించి ఉంటారని , ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలో పరీక్షల స్పీడ్ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ప్రస్తుతం వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటిపైనా నిఘా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.దీంతో ఏ ఇంట్లో అయినా కాస్త అనుమానాస్పద వ్యక్తులు ఉన్నా , ఏ మాత్రం వారిపై అనుమానం వచ్చినా వెంటనే వారికి పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.