నేటితో జూ. ఎన్టీఆర్ ఆది కి సరిగ్గా 18 ఏళ్ళు...

ఆది, ఆది కేశవ రెడ్డి అమ్మతోడు అడ్డంగా నరికేస్తా అని ఓ 19 సంవత్సరాల కుర్రాడు చెప్పేటువంటి డైలాగులు ఇప్పటికే అందరికీ బాగానే గుర్తు ఉంటాయి.

అయితే 2002వ సంవత్సరంలో టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ దర్శకత్వం వహించిన "ఆది" అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు మోత మోగించింది.

ఈ చిత్రంలో హీరోగా నటించినటువంటి నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన దైన శైలిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు.ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికరంగా సాగేటువంటి ఈ కథనం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది.

అయితే ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీత స్వరాలు సమకూర్చగా, బెల్లంకొండ సురేష్ మరియు నల్లమలపు బుజ్జి కలిసి సంయుక్తంగా నిర్మించారు.టాలీవుడ్ లో పేరు పొందినటువంటి పరుచూరి బ్రదర్స్ కథ, డైలాగులు అందించారు.

అయితే ఈ చిత్రం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 96 సెంటర్లలో 100 రోజులుకు పైగా ఆడింది.దీంతో దర్శకనిర్మాతలకు కాసుల పంట బాగానే పడింది.

Advertisement

అలాగే 106 సెంటర్లలో 50 రోజులకు పైగా ఆడింది.అంతేగాక మరో మూడు సెంటర్లలో 175 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది.

ఈ చిత్రంలో తొడ కొట్టు చిన్న అనే డైలాగ్ ఇప్పటికీ యూట్యూబ్ లో బాగానే ట్రెండింగ్ అవుతుంది.ఏదైనా అయినప్పటికీ ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన టువంటి ఆది చిత్రం అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించింది.అంతేకాక అప్పటి వరకు సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కి ఈ చిత్రం ఊపిరి పోసింది.

ఇక అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ తన సినీ ప్రస్థానాన్ని అలాగే కంటిన్యూ చేస్తూనే వస్తున్నాడు.అయితే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న"రౌద్రం రణం రుధిరం" అనే చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో అప్పట్లో తెలంగాణ సాయుధ బలగాల్లో పోరాడి అమరుడైనటువంటి కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు