టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి తన క్రేజ్‌ను చాటాలని విజయ్ దేవరకొండ ప్రయత్నిస్తున్నాడు.
ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లను పూరీ తెరకెక్కించనున్నాడు.ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించిన ఈ సినిమా ప్రస్తుతం కరోనా కారణంగా వాయిదా పడింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేతో రొమాన్స్ చేస్తు్న్నాడు.అయితే తొలుత ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ను అనుకున్నారు చిత్ర యూనిట్.కానీ ఆమె ఈ సినిమా చేయలేకపోవడంతో అనన్య పాండేతో పనికానిచ్చేస్తున్నారు.కాగా విజయ్ దేవరకొండకు బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీతో రొమాన్స్ చేయాలనే కోరిక ఉన్నట్లు తెలిపాడు.
అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకునే కియారా తన పక్కన చాలా బాగుంటుందని విజయ్ అభిప్రాయ పడుతున్నాడు.
గతంలో వీరిద్దరు కలిసి ఓ యాడ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ సమయంలో కియారా అందాలకు ఫ్లాట్ అయ్యాడట విజయ్.దీంతో కియారాతో ఎలాగైనా రొమాన్స్ చేయాలని విజయ్ చూస్తున్నాడు.
మరి అతడి కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి.