ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అందరికీ తెలిసిందే.చైనాలో కనుగొనబడిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది.
ఈ మహమ్మారి బారిన ఇప్పటికే కొన్ని లక్షల మంది పడగా, వేల సంఖ్యలో మరణాలు నమోదు అయ్యాయి.ప్రతి ఒక్క దేశం తమ ప్రజలను సురక్షితంగా ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఈ మహమ్మారి సోకిన వారిని వెంటనే గుర్తించి వారిని ఐసోలేషన్ వార్డుల్లో పెట్టి చికత్స అందించేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.
అయితే ఓ ఆంటీ మాత్రం కరోనా వైరస్‌న నిర్లక్ష్యం చేయడంతో ఆమె ఇప్పుడు ప్రపంచంలోని ప్రజల ఆగ్రహానికి గురవుతోంది.
దక్షిణ కొరియాకు చెందిన ఓ మహిళ ఫిబ్రవరి 6న ఒక ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరగా, ఆమెకు కరోనా ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.కాగా ఆమె దానిని పట్టించుకోకుండా ఓ చర్చికి వెళ్లింది.
అక్కడ సుమారు 1200 మందికి పైగా పోగు కావడంతో వారందరికీ ఈ వైరస్ సోకింది.
అంతేగాక ఆమె తన స్నేహితులతో కలిసి ప్రేమికుల రోజున ఓ స్టార్ హోటల్‌కు వెళ్లి ఎంజాయ్ చేసింది.
దీంతో మరికొంత మందికి కూడా ఈ వైరస్ సోకింది.ఇలా ఆమె వల్ల ఏకంగా 5000 మందికి కరోనా సోకినట్లు దక్షిణ కొరియా అధికారులు, వైద్యులు గుర్తించారు.
ఇలా ఇంతమందికి కరోనా సోకడానికి కారణమైన ఆ ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు.ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె, బయటకు రాగానే కఠిన చర్యలు తీసుకుంటామని ఆ దేశ అధికారులు హెచ్చరించారు.
కాగా మన దేశంలో కూడా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజూకు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ విధించింది.అయితే మరింత కఠన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.