జాకీచాన్ కి కరోనా అంటూ వార్తలు! క్లారిటీ ఇచ్చిన హీరో

చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా 78 దేశాలకి వ్యాపించిన కరోనా వైరస్ ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని భయపెడుతుంది.

ఇది తీవ్రత తక్కువగానే ఉన్న, కేవలం హృద్రోగ సమస్యలు ఉన్నవారిపైనే ఈ కరోనా ప్రభావం చూపిస్తుందని చెప్పిన కూడా ప్రజలు తీవ్ర భయాందోళనకి గురవుతున్నారు.

ఇక ఆసియా దేశాలలో ఈ కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటంతో ఈ భయం రెట్టింపు అవుతుంది.ఇదిలా ఉంటే ఈ కరోనా బారిన పడిన వాళ్ళలో రాజకీయ ప్రముఖులు, డాక్టర్లు కూడా ఉన్నారు.

ఇప్పుడు యూనివర్శల్ హీరో జాకీచాన్ ని కరోనా వచ్చిందని అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి.హంకాంగ్ లో ప్రారంభం అయిన ఈ వార్తలు సోషల్ మీడియా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయి.

కొన్ని గంటల్లోనే ఈ వార్తలు వైరల్ అవ్వడంతో జాకీ చాన్ కు అన్ని దేశాల నుంచి పరామర్శలు మొదలయ్యాయి.దీంతో జాకీచాన్ బయటకి వచ్చి ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు.

Advertisement

తన అభిమానులు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ ఉండటంతో తనకు కరోనా వైరస్ సోకినట్లుగా మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ప్రకటించాడు.సోషల్ మీడియా ద్వారా తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు.

ఇలాంటి పుకార్లను నమ్మి ఆందోళన చెందనక్కర్లేదని, నేను పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నాను మీరు కూడా కరోనా విషయంలో జాగ్రత్తలు వహించండి అంటూ పిలుపునిచ్చాడట.

Advertisement

తాజా వార్తలు