సూపర్ స్టార్ యునివర్సిల్ స్టార్ కాంబో..!

తమిళంలో దాదాపుగా 35 ఏళ్ల కిందట కమల్ హసన్ మరియు రజినీకాంత్ కాంబినేషన్ లో గిరఫ్తార్ అనే సూపర్ హిట్ట్ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.

ఆ చిత్రంలో కలిసి నటించిన వీరిద్దరూ ఇప్పుడు తమిళంలో పెద్ద సూపర్ స్టార్స్.

మరల అదే కాంబినేషన్ రిపీట్ కాబోతుంది అనే వార్తలు కోలీవుడ్ మీడియా కోడై కుస్తుంది.ఈ రోజు రజినీకాంత్ పెళ్లి రోజు ఈ రోజుతో అయన వైవాహిక జీవితానికి 39 ఏళ్లు నిండుతాయి.

ఈ సందర్భంగా రజినీకాంత్ అభిమానులు సోషల్ మీడియా వేదిక గా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇదే సందర్భంలో సూపర్ స్టార్ రజినీకాంత్, హీరోగా విశ్వనటుడు కమల్ హసన్ నిర్మాతగా ఓ సినిమాను నిర్మించాబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి.

ఇంకా ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ రజినీ, కమల్ అభిమానులు సంభరాలు చేసుకుంటున్నారు.ప్రస్తుతం రజినీకాంత్ అన్నాత్త తో బిజీగా ఉన్నాడు.

Advertisement

ఈ సినిమా తరువాత కార్తీ నటించిన ఖైదీ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, రజినీకాంత్ సినిమాను కమల్ నిర్మిస్తాడని సమాచారం.మర్చి 5న పూజ కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తుంది.

అదే నిజమైతే 35 ఏళ్ల తరువాత వారిద్దరీ కాంబినేషన్స్ లో ఓ సినిమా రాబోతుంది.ప్రస్తుతానికి కమల్ ఇండియన్ 2 చిత్రం తో బిజీగా ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు