నిర్భయ దోషుల శిక్ష అమలుపై సొలిసిటర్ జనరల్ సంచలన వ్యాఖ్యలు

నిర్భయ కేసు దోషుల శిక్షలు అమలుపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సంచలన వ్యాఖ్యలు చేశారు.

వారికి ఎప్పుడెప్పుడు ఉరిశిక్ష పడుతుందా అని ఒకపక్క దేశ వ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తుంటే తుషార్ మెహతా వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

దోషులకిచ్చిన వారం రోజుల గడువు ముగియడం తో మంగళవారం ఢిల్లీ హైకోర్టు నిర్భయ కేసు విచారణ కొనసాగింది.ఈ క్రమంలో తుషార్ మెహతా దోషులకు శిక్ష అమలు జరిపేందుకు తామెంతగా వాదించినా.

చివరికి మరోసారి డెత్ వారెంట్ పొందినా.శిక్ష అమలు ఇప్పుడప్పుడే జరిగే అవకాశాలు లేవంటూ ఆయన వ్యాఖ్యానించారు.

డెత్ వారెంట్ జారీ అయిన మరోక్షణం నాలుగో నిందితుడు పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ దాఖలు చేస్తాడని, దాంతో మొత్తం ప్రాసెస్ నిలిచిపోతుందని తుషార్ మెహతా అన్నారు.నలుగురు దోషుల్లో పవన్ గుప్తా ఇప్పటి వరకు తనకున్న న్యాయపరమైన వెసులుబాటును వినియోగించుకోలేదు.

Advertisement

దాంతో డెత్ వారెంట్ వచ్చిన మరుక్షణం పవన్ గుప్తా మెర్సీ పిటిషన్ సౌకర్యాన్ని వినియోగించుకుంటారని దాంతో ఉరిశిక్ష అమలు ప్రాసెస్ నిరవధికంగా వాయిదా పడుతుందని తుషార్ మెహతా అభిప్రాయపడుతున్నారు.జనవరి 22 న వారి ఉరిశిక్షలు అమలు కావాల్సి ఉండగా వాయిదా పడడం తో వారి ఉరిశిక్షలు ఫిబ్రవరి 1 వ తేదీకి వాయిదా వేశారు.

అయితే ఫిబ్రవరి 1 ఉదయం 6 గంటలకు వారి ఉరిశిక్షలు అమలు కావాల్సి ఉండగా,ఆ గడువు కాలానికి ఒక్క రోజు ముందు అనగా జనవరి 31 న వారి ఉరి శిక్షలను నిరవధికంగా వాయిదా వేస్తూ ఢిల్లీ పాటియాలా కోర్టు స్టే విధించింది.దీనితో నిర్భయ ఘటన జరిగి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వారికి శిక్షలు మాత్రం అమలుకావడం లేదు.

Advertisement

తాజా వార్తలు