ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ,మరికొద్ది గంటల్లో

ఢిల్లీ పీఠం ఎవరికీ దక్కుతుందో మరి కొద్దిసేపటిలో తేలిపోనుంది.

అయితే ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని ప్రతి ఒక్కరూ ఉత్కంఠ తో ఎదురుచూస్తున్నారు.

మొత్తం 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఏ పార్టీ అత్యధిక అసెంబ్లీ నియోజక వర్గాలను గెలుచుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈనెల 8 న ఢిల్లీ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన సంగతి తెల్సిందే.

అయితే ఈ పోలింగ్ ఫలితాలను ఈసీ అధికారులు వెల్లడించనున్నారు.మొత్తం 21 కేంద్రాల్లో కౌంటింగ్ నిర్వహించేందుకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.మొదట బ్యాలెట్ పేపర్ ఓట్లను లెక్కిస్తారు.

Advertisement

ఆ తరువాత ఈవీఎం ఓట్లు లెక్కింపు జరుగుతుంది.ఎన్నికల సంఘం అధికారులు, పోలింగ్ ఏజెంట్లు మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.

కౌంటింగ్ కు ఓ గంట ముందు అభ్యర్థి , పోలింగ్ ఏజెంట్ మాత్రమే కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతిస్తారు.కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ప్రకారం మరోసారి కేజ్రీ వాల్ ఆప్ పార్టీ నే అధికారంలోకి వస్తుంది అని, మరోసారి క్లీన్ స్వీప్ చేస్తుంది అంటూ తేల్చేశాయి.కానీ కేంద్రంలో అధికారం లో బీజేపీని కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు.

గత ఎన్నికల నుంచి కూడా ఢిల్లీ లో పీఠం ఎక్కాలని తెగ వ్యూహాలు రచిస్తున్న బీజేపీ ఈ సారి ఎలాంటి పోటీ ఇస్తుందో కూడా అంచనా వేయలేం.ఎగ్జిట్ పోల్స్ ఎలాంటి ఫలితాలను వెల్లడించినప్పటికీ జనాల్లో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.ఈ క్లారిటీ రావాలి అంటే ఈ కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యి ఫలితాలు వెలువడినాకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమా కాదా అన్న నిర్ధారణకు రాగలరు జనాలు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

మరి ఫలితాలు వచ్చే వరకు ఈ సస్పెన్స్ కొనసాగాల్సిందే అన్నమాట.

Advertisement

తాజా వార్తలు