శర్వానంద్, సమంత జంటగా నటించిన ‘జాను’ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ చిత్రానికి భారీ హైప్‌ను క్రియేట్ చేయకుండా సింపుల్‌గా దిల్‌రాజు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
సినిమాకు ఓపెనింగ్స్ కాస్త పూర్‌గానే వచ్చాయి.మూడు కోట్ల లోపులోనే మొదటి రోజు వసూళ్లు ఉన్నాయి.
అయితే రెండవ రోజు మూడవ రోజు అయిన శని ఆదివారాల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టి మొదటి మూడు రోజుల్లో దాదాపుగా 10 కోట్ల వరకు రాబట్టింది.
సినిమాపై ఉన్న ఆసక్తి నేపథ్యంలో ఈ చిత్రంను అన్ని ఏరియాలకు కలిపి బయ్యర్లు 21.5 కోట్లకు కొనుగోలు చేయడం జరిగిందట.ఓవర్సీస్‌లో మాత్రం ఈ చిత్రం రెండు కోట్లకు అమ్ముడు పోగా అక్కడ కోటి నుండి కోటిన్నర వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక అక్కడ మరింతగా వసూళ్లు రాబట్టడం అసాధ్యంగానే కనిపిస్తుంది.కనుక ఓవర్సీస్‌లో 50 లక్షల నుండి 75 లక్షల వరకు నష్టం ఉండే అవకాశం కనిపిస్తుంది.

సినిమా మరో వారం రోజుల పాటు నడిచే అవకాశం ఉంది.కనుక ఆ రన్‌లో 6 నుండి 8 కోట్ల వరకు రాబట్టవచ్చు.అయితే లాంగ్ రన్‌లో ఈ చిత్రం 21.5 కోట్లను వసూళ్లు చేయడం మాత్రం కష్టమే అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు.ఈ చిత్రం బయ్యర్లకు మూడు కోట్ల వరకు నష్టం కలిగించే అవకాశం ఉంది అంటున్నారు.అయితే నిర్మాత దిల్‌రాజు మాత్రం ఇప్పటికే సేఫ్ అయ్యాడు.ఆన్‌లైన్ మరియు ఇతరత్ర రైట్స్‌ను అమ్మడం ద్వారా మరింతగా లాభాలు దక్కించుకునే అవకాశం ఉంది.