విడ్డూరం : ఆ పెళ్లిని అయ్యగారు కాదు అమ్మగారు చేశారు, ఎందుకో తప్పక తెలుసుకోవాల్సిందే

సహజంగా హిందువుల పెళ్లిల్లు అంటే వేద మంత్రాలు గుర్తుకు వస్తాయి.వేద మంత్రాలను పఠించేది అయ్యగార్లు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బ్రహ్మణులు అనగానే మగవారే గుర్తుకు వస్తారు.అయ్యగార్లుగా వారు ఫేమస్‌ అయ్యారు.

కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందూ సామ్రాజ్యం ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు కూడా అయ్యవార్లు ఉంటారు.అంతటా కూడా మగవారే ఉంటారు కాని ఎక్కడ కూడా ఆడ బ్రహ్మణ పురోహితులు కనిపించరు.

కాని మొదటి సారి ఒక లేడీ పురోహిత్‌ కనిపించారు.తమిళనాడులో జరిగిన ఒక పెళ్లిలో లేడీ పురోహిత్‌ కనిపించి అందరికి ఆశ్చర్యం కలిగించారు.

Advertisement

అయ్యగారి కంటే బ్రహ్మాండంగా ఈ అమ్మగారు మంత్రాలు చదువుతూ పెళ్లిని నిదానంగా హడావుడి లేకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేయించి వధు వరులను ఆశీర్వదించారు.ఈ అమ్మగారి పేరు బ్రమరాంభ.

కర్ణాటకకు చెందిన ఈమెను సుష్మా మరియు విఘ్నేశ్‌ల పెళ్లి కోసం తమిళనాడు రప్పించారు.ఈ కొత్త జంట తమ పెళ్లి చాలా ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశ్యంతో పెళ్లికి మొత్తం ఆడవారితో ఏర్పాట్లు చేయించి, అన్ని విభాగాల్లో కూడా ఆడవారిని నియమించాలనుకున్నారు.

పెళ్లి సమయం వచ్చింది.అయితే మంగళ వాయిద్యంకు ఆడవారు లభ్యం కాలేదు.కాని అయ్యగారు కాకుండా అమ్మగారు మాత్రం వీరికి లభించింది.

బ్రమరాంభ గురించి తెలుసుకున్న ఈ జంట వెంటనే ఆమెను సంప్రదించారు.మొదట ఆమె గురించి ఎంక్వౌరీ చేసిన వీరికి మంచి ఫీడ్‌ బ్యాక్‌ లభించింది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

అందుకే మరో ఆలోచన లేకుండా పెళ్లిని ఆమెతో చేయించుకున్నారు.మహిళలను అన్ని రంగాల్లో కూడా పైకి తీసుకు వచ్చేందుకు ఇదో చిన్న ప్రయత్నంగా వారు చెబుతున్నారు.

Advertisement

అయితే పెళ్లికి వచ్చిన వారు మాత్రం పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడిని చూడటం మానేసి అమ్మగారినే చూస్తూ ఉండిపోయారు.ఆమె అనర్ఘలంగా మంత్రాు తప్పులు పోకుండా, పొల్లు పోకుండా గట్టిగా చదవడం అందరిని ఆశ్చర్య పర్చింది.

మీకు ఇలాంటి విభిన్నమైన పెళ్లి, మీ పెళ్లి కూడా ఇలా వార్తల్లో నిలవాలి అంటే బ్రమరాంభ గారిని సంప్రదించండి.

తాజా వార్తలు