జాను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత కలిసి నటిస్తున్న తాజా చిత్రం జాను రిలీజ్‌కు రెడీ అవుతోంది.తమిళంలో సూపర్ హిట్ చిత్రం ‘96’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది.

 Jaanu Pre Release Event Gets Date-TeluguStop.com

ఈ ట్రైలర్ ఫీల్ గుడ్‌గా ఉండటంతో ప్రేక్షకులు జాను సినిమా కోసం ఆసక్తిగా చూస్తు్న్నారు.ఇక ఈ సినిమాను ఒరిజినిల్ చిత్రం తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

కాగా ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్‌ను చిత్ర యూనిట్ ఫిబ్రవరి 1న జరిపేందుకు రెడీ అవుతున్నారు.ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ఈ ఈవెంట్ బాగా ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.

ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించేందుకు చిత్ర ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు.

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమాకు అక్కడ పిచ్చ క్రేజ్ దక్కింది.ఇప్పుడు అదే క్రేజ్‌ను రిపీట్ చేసేందుకు శర్వానంద్, సమంత ప్రయత్నిస్తు్న్నారు.

గోవింద్ వసంత సంగీతం ఈ సినిమాకు మేజర్ బలం కానుంది.ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube