జాను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్

యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత కలిసి నటిస్తున్న తాజా చిత్రం జాను రిలీజ్‌కు రెడీ అవుతోంది.

తమిళంలో సూపర్ హిట్ చిత్రం ‘96’కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయ్యి మంచి ఆదరణ పొందింది.

ఈ ట్రైలర్ ఫీల్ గుడ్‌గా ఉండటంతో ప్రేక్షకులు జాను సినిమా కోసం ఆసక్తిగా చూస్తు్న్నారు.

ఇక ఈ సినిమాను ఒరిజినిల్ చిత్రం తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి.

కాగా ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్‌ను చిత్ర యూనిట్ ఫిబ్రవరి 1న జరిపేందుకు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు ఈ ఈవెంట్ బాగా ఉపయోగపడుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.

ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానించేందుకు చిత్ర ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ఆయన రెడీ అవుతున్నారు.తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమాకు అక్కడ పిచ్చ క్రేజ్ దక్కింది.

ఇప్పుడు అదే క్రేజ్‌ను రిపీట్ చేసేందుకు శర్వానంద్, సమంత ప్రయత్నిస్తు్న్నారు.గోవింద్ వసంత సంగీతం ఈ సినిమాకు మేజర్ బలం కానుంది.

ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.