అసురన్‌ తెలుగు టైటిల్‌ ఏంటో తెలుసా?

తమిళంలో గత ఏడాది వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం అసురన్‌.

ధనుష్‌ హీరోగా నటించిన ఆ చిత్రంను తెలుగులో ప్రస్తుతం వెంకటేష్‌ హీరోగా రీమేక్‌ చేస్తున్నారు.

తెలుగులో పెద్ద ఎత్తున విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో ఈ చిత్రాన్ని స్వయంగా సురేష్‌బాబు నిర్మిస్తున్నాడు.ఇక ఈ చిత్రం టైటిల్‌పై క్లారిటీ ఇచ్చేందుకు సినిమా యూనిట్‌ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు నారప్ప అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట.ధనుష్‌ సినిమాకు అసురన్‌ అనే టైటిల్‌ ఎలా అయితే సూట్‌ అయ్యిందో తెలుగు రీమేక్‌కు నారప్ప సరిగ్గా సెట్‌ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు.

ఒకటి రెండు రోజుల్లో ఈ విషయమై తుది నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది.ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

వరుసగా ఫ్లాప్‌ చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడికి ఈ చిత్రం సక్సెస్‌ చాలా కీలకం.అందుకే ఈ చిత్రంను ఆయన చాలా జాగ్రత్తగా తీస్తున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు