అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురంలో సినిమా సూపర్ హిట్ టాక్‌ను దక్కించుకుంది.ఏకంగా 200 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.
బన్నీ కెరీర్‌లో మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.ఇక ఈ చిత్రం సూపర్ హిట్ నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు వైజాగ్‌లో పెద్ద ఎత్తున సక్సెస్ వేడుక నిర్వహించారు.
ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సభ్యులు మొత్తం కూడా ఈ సక్సెస్ క్రెడిట్‌ను పూర్తిగా థమన్‌కు ఇచ్చేశారు.

అల వైకుంఠపురంలో సినిమాలోని పాటలతో సినిమాను మరోస్థాయికి తీసుకు వెళ్లడంలో ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యాడు.ఏమాత్రం డౌట్ లేకుండా ఆయన చేసిన ఈ ట్యూన్స్ సినిమా సూపర్ హిట్ అవ్వడంలో కీలక పాత్ర పోషించాయి.థమన్ ఈ సినిమాకు హీరో అంటూ చాలా మంది ప్రశంసించారు.
నిన్నటి సక్సెస్ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు థమన్‌పై చేసిన కామెంట్స్ ఆయన ఈ సినిమాకు ఎంతగా కష్టపడ్డాడో చెప్పకనే చెప్పాయి.
సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని పక్కకు నెట్టి మరీ ఈ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది.
ఒక మంచి సినిమా అంటూ ఫ్యామిలీ ఆడియన్స్ మరియు ఇతర ప్రేక్షకులు అంతా కూడా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.మొత్తానికి అల వైకుంఠపురంలో సినిమాతో థమన్ తన పారితోషికంను డబుల్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.