మీకు తెలుసా : ఇకపై డబ్బు డిపాజిట్ కు మీ బ్యాంక్ కే వెళ్లనక్కర్లేదు

బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్న విషయం తెలిసింది.ఇప్పటికే వినియోగ దారుడు బ్యాంక్ కు వెళ్లే పని సగానికి పైగా తగ్గిందని చెప్పుకోవచ్చు.

డబ్బులు డిపాజిట్ చేయడం మరియు తీయడం కు మిషన్స్ వచ్చాయి.అయితే అవి చిన్న మొత్తాలను మాత్రమే అందుబాటులోకి తీసుకు వచ్చాయి.

పెద్ద మొత్తాలు వేయాలి అంటే బ్యాంక్ కు వెళ్లాల్సిందే.

మనకు ఏ బ్యాంక్ లో అయితే అకౌంట్ ఉంటుందో అదే బ్యాంక్ లోకి వెళ్లి డబ్బులు డిపాజిట్ చేయాలి.మనకు సంబంధించిన బ్యాంక్ దగ్గరగా లేకుంటే చాలా దూరం వెళ్లి మరీ డిపాజిట్ లేదంటే సొమ్ము జమ చేయాల్సి వచ్చేది.కొన్ని సార్లు స్థానికంగా ఆ బ్యాంక్ ఉండేది కూడా కాదు.

Advertisement

అలాంటప్పుడు వినియోగదారులు చాలా ఇబ్బందులను ఎదురుకొంటున్నారు.ఆ ఇబ్బందులకు ఇకపై చెక్ పెట్టబోతున్నారు.

ఆర్బీఐ వారు తీసుకు రాబోతున్న ఈ విప్లవాత్మక మార్పులకు అతి త్వరలో ముహూర్తం కుదరనుంది.ఆర్బీఐ వారి కొత్త నిర్ణయంతో వినియోగదారులు డబ్బును ఏ బ్యాంక్ లో అయినా డిపాజిట్ చేసుకోవచ్చు.ప్రస్తుతం ఇతర బ్రాంచ్ ఎటిఎం లలో ఎలా అయితే డబ్బులను వినియోగదారులు తీసుకుంటున్నారో అలాగే అమౌంట్ ను కూడా వేసే అవకాశం ఉంటుంది.

అయితే ఇందుకు కాస్త ఛార్జీ వసూలు చేసే అవకాశం ఉంది అంటున్నారు.ఛార్జ్ పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి అవకాశాన్ని ప్రవేశ పెట్టటం మంచి పరిణామం అంటూ వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు