పవన్‌ బీజేపీతో కలవడంపై రామకృష్ణ సీరియస్‌

జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి తనలో కమ్యూనిస్ట్‌ భావజాలం ఉందంటూ చెప్పుకొచ్చిన పవన్‌ కళ్యాణ్‌ ఇప్పుడు పోయి బీజేపీతో అది కూడా మత తత్వ పార్టీ అయిన బీజేపీతో కలవడం ఏంటీ అంటూ సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గతంలో జనసేనతో కలిసి రామకృష్ణ పని చేసిన విషయం తెల్సిందే.

ఎన్నికల్లో కలిసి పోరాడారు.రాష్ట్రంలో సీపీఐకి పెద్దగా బలం లేకున్నా కూడా జనసేన వారికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు.

ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పవన్‌ ప్రకటించాడు.

ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పాలి అంటూ రామకృష్ణ ప్రశ్నించాడు.నీ కమ్యూనిస్ట్‌ భావజాలం ఇదేనా అంటూ రామకృష్ణ ప్రకటించాడు.

Advertisement

నీలో కమ్యూనిజం భావజాలం ఉందని ఎలా అంటావు అంటూ రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశాడు.మతతత్వ పార్టీ అయిన బీజేపీతో జనసేన కలవడంతో ఆ పార్టీ కూడా అలాంటి పార్టీనే అయ్యిందని, పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయం ఏమాత్రం కరెక్ట్‌ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు