చెన్నైలో వసూళ్ల సునామీ సృష్టిస్తున్న రజినీకాంత్....

తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన టువంటి చిత్రం దర్బార్.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించాడు.

ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన తమిళ్ బ్యూటీ క్వీన్ నయనతార నటించగా నివేదా థామస్ సునీల్ శెట్టి ప్రతీక్ బబ్బర్ యోగి బాబు వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.అయితే భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా ఈ నెల 9వ తారీఖున విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.

అంతేగాక ఈ చిత్రంతో  రజనీకాంత్ తనలో సత్తా ఇంకా ఉందంటూ నిరూపించుకున్నాడు.అయితే ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

అయితే ఇది ఇలా ఉండగా తమిళనాడులోని చెన్నైలో ప్రస్తుతం రజనీకాంత్ తన హవా కొనసాగిస్తున్నాడు.విడుదలైన ఏడు రోజుల్లోనే ఒక్క చెన్నై సిటీ పరిధిలో మాత్రమే పది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించాడు.

Advertisement

అయితే ఈ చిత్రంలో రజనీకాంత్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.అందువల్లనే  విడుదలైన రోజు నుంచి ఇప్పటి వరకు కలెక్షన్ల జోరు తగ్గలేదు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు