ఏపీ రాజధాని అమరావతిలో పర్యటించి వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలనే చంద్రబాబు నాయుడు ప్లాన్ బాగానే వర్కవుట్ అయ్యింది.ముందుగా చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ కొంతమంది నిరసన కార్యక్రమాలు చేసినా చంద్రబాబు ముందుకే కదిలారు.
ఈ సందర్భంగా నేలను ముద్దాడి అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు.ఇక ఈ సందర్భంగా చంద్రబాబు అధికార వైసీపీ మీద విమర్శలు గుప్పించారు.
సీఎం జగన్ కు రాజ్యాంగం, చట్టం, కోర్టులు అంటే గౌరవం లేదని విమర్శలు చేశారు.ప్రతి సందర్భంలోనూ వైసీపీ ప్రభుత్వం చట్ట ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు.
అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎవరూ కాపాడలేరని బాబు అన్నారు.ఈ రోజు ఆనందంగానే ఉన్నా, భవిష్యత్తులో మానసిక క్షోభ తప్పదని ‘బీ కేర్‌ఫుల్’ అంటూ హెచ్చరించారు.
పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని, ఇసుకను ఎందుకు ఉచితంగా ఇవ్వడంలేదు అంటూ ప్రశ్నించారు.నవరత్నాలను నవగ్రహాలని బాబు విమర్శలు చేశారు.