సానుభూతి అన్నది రాజకీయాల్లో గెలుపుకు కీలక మంత్రం గా పనిచేస్తుంది.ఈ విషయం దేశ రాజకీయాల్లో అనేకసార్లు నిరూపితమైంది .
అందుకే సహజంగా ఏదైనా ఒక నియోజకవర్గంలో ఒక నాయకుడు మరణిస్తే ఆ నాయకుడు కుటుంబంలోని మరొక వ్యక్తికి టికెట్ ఇచ్చి పోటీ చేయిస్తారు ఆ వ్యక్తి పై పోటీ పెట్టడానికి మిగిలిన పక్షాలు కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాయి .కాబట్టి సానుభూతి రాజకీయాల్లో బలంగా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు .అందుకే రాజకీయ పక్షాలు ప్రజల్లో సానుభూతి పొందడం కోసం రకరకాల వ్యూహాలు పన్నుతూ ఉంటాయి … అదృష్టం కొద్దీ కొన్నిసార్లు కొన్ని పార్టీలకు అవకాశాలు కలిసి వస్తూ ఉంటాయి .

అలా వైసిపి పార్టీకి గత ఎన్నికల్లో కలిసి వచ్చిన రెండు పరిణామాలు ఇప్పుడు వ్యతిరేకంగా మారి ఓటమి దిశగా నడిపిస్తాయా అన్న విశ్లేషణలు వస్తున్నాయి … కోడి కత్తి కేసు ని తీసుకుంటే జగన్( YS Jagan Mohan Reddy ) పై ఎయిర్పోర్టులో జరిగిన ఈ దాడి విషయంలో ప్రస్తుత అధికార పార్టీకి సానుభూతిపరంగా చాలా కలిసి వచ్చింది అని చెప్పాలి .కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బలమైన పార్టీలతో పోటీపడుతూ,, నిత్యం ప్రజల్లో ఉంటున్న జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి వల్ల జగన్ పై ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్లో సానుభూతి పెల్లుబికిందని చెప్పొచ్చు .

దానికి తోడు కాంగ్రెస్ పార్టీ కక్షగట్టి జైల్లో పెట్టిందన్న ప్రచారం , వీటన్నిటికీ తోడు కుటుంబ సభ్యుడైన వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy ) మరణం కూడా సానుభూతిపరంగా పార్టీకి కలిసి వచ్చిన పరిణామంగానే చూడాలి .ఆయన పట్ల జరుగుతున్న దాడులను చూసిన ప్రజానీకం ఒక్క సారి అవకాశం ఇవ్వమన్న ఆయన అభ్యర్థన మన్నించి మన్నిఆయనకు భారీ స్థాయి మెజారిటీ ఇచ్చి అధికారాన్ని అప్పు చెప్పారు .

అయితే ఇటీవల ఈ రెండు కేసులు అధికార పార్టీ ఇమేజ్ను తగ్గించే విధంగా వైసీపీ పార్టీకి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే విధంగా ముందుకు సాగడం విశేషం .కోడి కత్తి విషయం లో .ఏ రాజకీయ పార్టీ పార్టీకి సంబంధం లేదని వ్యక్తిగత కారణాలతోనే అతను దాడికి పాల్పడ్డాడని ఎన్ఐఏ తేల్చేయడం అధికార పార్టీకి కొంత వ్యతిరేక ఫలితంగానే చూడాలి .అంతేకాకుండా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబం సభ్యులు కేంద్రంగా ముందుకు కదలటం, దాదాపు ఇప్పటివరకు బయటపడిన సాక్షాదారాలన్నీ జగన్ కుటుంబ సభ్యులు మరియు పార్టీ కీలక నెతలైన వైయస్ అవినాష్ రెడ్డి వైయస్ భాస్కర్ రెడ్డి ( Y.S Bhaskar Reddy ) వైపు వేలెత్తి చూపడంతో ఈ ప్రభావం వచ్చే సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని ….వైసిపి పార్టీకి ఇబ్బందులు తప్పవని విశ్లేషణలు వస్తున్నాయి మరి ఈ విశ్లేషణ లు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి
.