యజమాని బొటనవేలును కొరికేసిన కుక్క... అదే అతడికి వరమైంది!

సాధారణంగా పెంపుడు కుక్కలు( pet dogs ) తమ యజమానుల పట్ల చాలా లాయల్టీని ప్రదర్శిస్తాయి.ఇంకా చెప్పాలంటే ఇవి మనిషికంటే కూడా ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటాయి.

 The Dog That Bit The Owner's Thumb That's What Happened To Him, Uk, Telugu Nri,-TeluguStop.com

ఎలాంటి పరిస్థితులలోను అవి తమ అన్నం పెట్టిన యజమానుల పట్ల దాడి చేయవు.అయితే ఇక్కడ ఓ పెంపుడు కుక్క తన యజమాని అని కూడా కనికరం లేకుండా దాడి చేసింది.

కట్ చేస్తే ఆ కుక్క చేసిన గాయం అతడికి వరమైంది.వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది అక్షరాలా నిజం.

యూకేలో ఓ వ్యక్తి నిద్రిస్తుండగా పెంపుడు కుక్క అతనిపై దాడి చేసింది.ఈ క్రమంలో యజమాని బొటనవేలును( thumb ) ఆ కుక్క నమిలేసింది.అయితే అదే అతనికి వరంలా మారింది.అతని ప్రాణాలను కాపాడినట్లు అయింది.వివరాల్లోకి వెళితే, యూకేకు చెందిన డేవిడ్ లిండ్సే( David Lindsay ) తన పిట్‌బుల్‌ డాగ్‌ ( Pitbull dog )హార్లేతో కలిసి సోఫాలో నిద్రిస్తున్నాడు.అప్పుడు అతడి పెంపు కుక్క 7 నెలల బుల్‌డాగ్‌ అతడి కాలి బొటన వేలుని కొరికేసింది.

అయితే కుక్క కాలి బొటనవేలును నమిలివేస్తుండగా.అతడి భార్య గట్టిగా అరవడంతో అతడు నిద్ర లేవడం జరిగింది.

యజమాని సడెన్‌గా లేచి చూసేటప్పటికి.బొటన వేలు విరిగిపోవడంతో పాటు ఒక గోరు వేలాడుతూ కూడా కనిపించింది.కుక్క ఏమి చేసిందో తెలుసుకుని దంపతులు ఆశ్చర్యపోయినప్పటికీ, అది అతడికి వరంగా మారింది.విచిత్రమేమిటంటే ఎముక బయటకు వచ్చేలా గాయం చేసినా అతడికి నొప్పి తెలియకపోవడం.దీంతో అతను వెంటనే ఆస్పత్రికి వెళ్లి జాయిన్‌ అవ్వగా అసలు విషయం బయటపడింది.తనకు డయాబెటీస్‌ వచ్చిందని, శరీరంలో 2 దమనులు మూసుకుపోవడం వల్ల కాళ్లకు రక్తం సరిగా సరఫరా కావడం లేదని డాక్టర్లు చెప్పారు.

ప్రస్తుతం అతగాడు డయాబెటీస్‌ కి చికిత్స తీసుకుంటున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube