భారత్ సహా తదితర దేశాల ప్రజలు అమెరికాలో స్థిరపడి రెండు చేతులా సంపాదించాలని ఎన్నెన్నో కలలు కంటూ ఉంటారు.అయితే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆ దేశ ఇమ్మిగ్రేషన్ విధానంలో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి.
అమెరికా పౌరసత్వం కోసం చేసుకునే దరఖాస్తు ప్రక్రియ సైతం ఖరీదైనదిగా మారిపోయింది.
యూఎస్ శాశ్వత పౌరసత్వం, గ్రీన్ కార్డ్ తదితర వ్యయాలు 61 శాతం పెరగనుంది.
వివాహ సంబంధిత గ్రీన్ కార్డ్ దరఖాస్తు రుసుము 56 శాతం పెరిగింది.ఇది గతంలో 1,760 డాలర్లు ఉండగా.
దానిని 2,750 డాలర్లకు పెంచారు.అలాగే ఇమ్మిగ్రేషన్ పాలసీలో ఫెడరల్ రిజస్టర్ నవంబర్ 14 నుంచి కొత్తమార్పులను ప్రకటించింది.30 రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఇవి అమల్లోకి రానున్నాయి.

హోంలాండ్ సెక్యూరిటీ విభాగం శరణార్థుల దరఖాస్తులపైనా రుసుము విధించాలని యోచిస్తోంది.ఫిజి, ఆస్ట్రేలియా మరియు ఇరాన్ మాత్రమే ఇప్పుడు అలా చేస్తున్నాయి.ప్రస్తుతమున్న ఫీజులు సహజీకరణ అందించే పూర్తి ఖర్చులను తిరిగి పొందలేమని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అభిప్రాయపడింది.ప్రధానంగా వీసా, గ్రీన్‌కార్డ్, శాశ్వత నివాసం కొరకు దరఖాస్తు చేసేవారితో పాటు శరణార్థుల నుంచి వసూలు చేసే ఫీజులను పెంచని పక్షంలో యూఎస్‌సీఐఎస్‌కి సగటులన 1.2 బిలయన్ డాలర్ల నిధుల కొరత వస్తుందని అంచనా.