మయాంక్‌ మాయతో దుమ్ము రేపిన టీం ఇండియా

ఇండియా బంగ్లాదేశ్‌ల మద్య జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్‌ ఫలితం మొదటి రోజే తేలిపోయింది.

తక్కువ పరుగులకే బంగ్లాదేశ్‌ను ఆలౌట్‌ చేసిన టీం ఇండియా బౌలర్లు మ్యాచ్‌ను ఇండియా వైపుకు లాక్కోగా బ్యాట్స్‌మన్‌ మొత్తం టెస్టు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశారు.

మయాంక్‌ తన కెరీర్‌లో రెండవ డబుల్‌ సెంచరీ చేయడంతో ఈ మ్యాచ్‌ ఫలితం మొత్తం ఇండియా వైపుకు వచ్చేసింది.ఇండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 493 పరుగులు సాధించింది.

మయాంక్‌ 243 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు.మూడవ రోజే ఆటను ముగించాలని టీం ఇండియా బ్యాట్స్‌మన్‌లు పట్టుదలగా ఉన్నట్లుగా అనిపిస్తుంది.

అందుకోసం మొదటి సెషన్‌ ఆడి డిక్లెర్‌ ఇచ్చే అవకాశాలున్నాయి.స్కోర్‌ 550 వరకు చేస్తే భారీ స్కోర్‌ లక్ష్యం విధించినట్లవుతుంది.

Advertisement

తద్వారా వారిపై ఒత్తిడి ఉంటుందని టీం ఇండియా భావిస్తుంది.మూడవ రోజు కాకున్నా నాల్గవ రోజు ఆరంభంలోనే మ్యాచ్‌ ముగిసినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

ఈ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించి మయాంక్‌ మరోసారి హీరో అయ్యాడు.

Advertisement

తాజా వార్తలు