జగన్‌ కరుడుగట్టిన నేరస్థుడు.. రాజారెడ్డిని దింపేశాడు

నేను అధికారంలో ఉన్నపుడు ఇలా చేసి ఉంటే.వైసీపీలో ఒక్కరైనా మిగిలి ఉండేవారా? మాజీ సీఎంను.

నా ఇంటి గేటుకే తాళ్లు కడతారా? నా ఇంటిపై డ్రోన్‌ ఎగరేస్తారా? ఎంత ధైర్యం? జగన్‌ కరడు గట్టిన నేరస్థుడు.ఆయనకు అన్నీ ఆయన తాత పోలికలే వచ్చాయి.

ఇవీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలు.

చిత్తూరు జిల్లాలో తన మూడు రోజుల పర్యటనను ముగించుకున్న తర్వాత చంద్రగిరి మండలం ఐతేపల్లిలో మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా ఆరు నెలల వైసీపీ ప్రభుత్వ పాలనను ఆయన ఏకిపారేశారు.

మీడియా గొంతు నొక్కేలా జగన్‌ సర్కార్‌ తీసుకొచ్చిన జీవో 2430పై బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు."వైఎస్‌ హయాంలో ఇలాంటిదే జీవో 938 తీసుకొస్తే.

Advertisement

నేను తీవ్రంగా ప్రతిఘటించాను.దీంతో అప్పుడు ఆయన వెనుకడుగు వేశారు.

కానీ జగన్‌ అదే జీవోకు మరికాస్త పదును పెట్టి అన్ని విలువలనూ వదిలేశారు.తప్పుడు కేసులు పెడుతున్నారు.

జర్నలిస్టులను హత్య చేస్తున్నారు.రాష్ట్రంలో పరిస్థితి బీహార్‌ కంటే దారుణంగా ఉంది" అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఉన్మాద ప్రభుత్వాన్ని తాను చూడలేదని ఆయన అన్నారు.ప్రత్యర్థులను దెబ్బతీయడానికి జగన్‌ తాత రాజారెడ్డి వాళ్ల చీనీ చెట్లను నరికివేయించేవారని, ఇప్పుడు అదే మనస్తత్వం జగన్‌కు వచ్చిందని బాబు విమర్శించారు.

టీటీడీలో జరుగుతున్న అపచారాలపైనా ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు.అసలు జగన్‌ హిందువా లేక క్రిస్టియనా అన్నది బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు."నేను 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాను.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

ఏనాడైనా టీటీడీలో ఇలాంటి అపచారాలు జరిగాయా? హిందూ సంస్థలు ఆందోళన చేసే పరిస్థితి తలెత్తిందా? అసలు పింక్‌ డైమండ్‌ ఏమైంది? నా ఇంట్లో ఉందని అప్పుడు ఆరోపణలు చేశారు.ఇప్పుడా డైమండే లేదంటున్నారు.

Advertisement

ఈ ఆరోపణలు చేసిన విజయసాయిరెడ్డి, రమణదీక్షితులుపై పరువు నష్టం దావా వేశాము.అలాంటి దీక్షితులును మళ్లీ తీసుకొచ్చిన పెట్టుకున్నారు.

ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మారెడ్డిని మళ్లీ అదనపు ఈవోగా ఎలా పెడతారు? " అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.ఒకప్పుడు తిరుమల వచ్చిన సోనియాగాంధీ, అబ్దుల్‌ కలాంలాంటి వాళ్లు కూడా తమకు పూర్తిగా హిందూమతంపై గౌరవం ఉందని టీటీడీకి డిక్లరేషన్‌ ఇచ్చారని, మరి జగన్మోహన్‌రెడ్డి వాళ్ల కంటే గొప్పవారా అంటూ నిలదీశారు.

టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్న తీరు, పెడుతున్న కేసులపైనా చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగానే ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇప్పుడు జగన్‌ వ్యవహరిస్తున్నట్లుగా తాను అధికారంలో ఉన్నపుడు వ్యవహరించి ఉంటే.

వైసీపీలో ఒక్కరైనా మిగిలి ఉండేవారా అంటూ ప్రశ్నించారు.జేసీ దివాకర్‌రెడ్డి బస్సులను సీజ్‌ చేయించడం, అఖిలప్రియ, చింతమనేనిలాంటి వారిని వేధించడాన్ని బాబు ప్రస్తావించారు.

చిత్తూరు జిల్లాలో అయితే ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే మరీ బరి తెగించి వ్యవహరిస్తున్నారని, ఇలాంటి వాళ్ల ఆట కట్టించడానికి ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.వైసీపీ ఆరు నెలల పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విజన్‌ 2020లాగా తాను విజన్‌ 2050ని కూడా రూపొందించానని, దానిని అమలు చేసే అదృష్టం తనకూ, ఏపీ ప్రజలకూ లేకుండా పోయిందని చంద్రబాబు అన్నారు.

తాజా వార్తలు