40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న అతి తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ముందువరుసలో ఉన్న చంద్రబాబు( Chandrababu Naidu ) జరిగే ప్రతీ పరిణామాన్ని రాజకీయ కోణంలోనే చూస్తారు అంటారు.తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి( NTR Shatajayanthi ) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కి గౌరవం గా 100 రూపాయల నాణాన్ని విడుదల చేసింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరిగింది.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు , వారసులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు .అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు అవ్వలేదు.

అయితే ఈ సందర్భాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా వాడుకుంటారని జూనియర్ ఎన్టీఆర్ తో మళ్ళీ కలిసి పోతారని దానికి పురందేశ్వరి( Purandeshwari ) మధ్యవర్తిత్వం వహిస్తారని కూడా వార్తలు వచ్చాయి.అయితే కారణాలు ఏమిటో తెలియదు కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.అయితే బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో ( JP Nadda ) మాత్రం సమావేశం కుదిరింది .ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన జేపి నడ్డా తో కార్యక్రమం ఆద్యంతం చంద్రబాబుతో సన్నిహితం గా మెలిగినట్టు తెలుస్తుంది .అంతేకాకుండా కార్యక్రమం ముగిసిన తర్వాత కూడా పురందేశ్వరి, చంద్రబాబు, జేపి నడ్డా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రాజకీయాలపై చర్చించారని,

తెలుగుదేశంతో పొత్తుకు నడ్డా కూడా ఆసక్తి గా ఉన్నందున రాజకీయంగా పొత్తుపొడిచే అవకాశాలు ఉన్నాయంటూ ఇప్పుడు విశ్లేషణలు వస్తున్నాయి.తెలుగుదేశంతో పొత్తుకు అప్పుడే చర్చలు జరిగినప్పటికీ ఆ తరువాత ముందుకు కదల్లేదు.అయితే పురందేశ్వరి బిజెపి ఆంధ్ర ప్రదేశ్ శాఖకు అధ్యక్షురాలు అయిన తర్వాత మళ్లీ చర్చలు ముందుకు సాగుతున్నాయని, ఆమె రెండు పార్టీల మధ్య సహృద్భావ వాతావరణాన్ని సృష్టిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.జనసేన( Janasena ) మాత్రమే మా ఏకైక బాగస్వామి అని చెప్పుకుంటున్న బిజెపి తెలుగు దేశానికి ఏ మేరకు అవకాశం ఇస్తుందో చూడాలి
.