విడ్డూరం : తన కుటుంబంకు పట్టిన దెయ్యాన్ని పోగొట్టేందుకు 30 ఏళ్లుగా పెళ్లి కూతురు డ్రస్‌ వేసుకుంటున్నాడు

కొందరి మూడ నమ్మకాలు చూస్తుంటే బుద్దిలేదా అనిపిస్తుంది.ఇంత సిల్లీగా ఎలా ఆలోచిస్తారు అనిపిస్తుంది.

చాలా మంది మూడ నమ్మకాలను పాటిస్తారు.కాని కొందరు తమ జీవితమే మూడ నమ్మకం అయ్యేలా చేసుకుంటారు.

దెయ్యాలు బూతాలు అంటూ చాలా మంది భయపడతారు.కాని ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి దెయ్యం పేరుతో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 30 ఏళ్లుగా పెళ్లి కూతురు డ్రెస్‌ మాత్రమే వేసుకుని ఉంటున్నాడు.

అతడు పెళ్లి కూతురు డ్రస్‌ కాకుండా మరే డ్రస్‌ వేసుకున్నా కూడా ఆయన కుటుంబంలో ఎవరో ఒకరు మృతి చెందడం ఖాయంగా పరిస్థితి ఉంది.అతడి గురించి తెలిసిన వారు నవ్వుకుంటారు, ఆ తర్వాత కోపగించుకుంటారు, ఆ తర్వాత అసహించుకుంటారు.

Advertisement

ఇలా ఒకే వ్యక్తిపై అన్ని ఫీలింగ్స్‌ కలుగుతున్నాయి అంటే అతడు ఎలాంటి వాడో, అతడు పాటిస్తున్న మూడ నమ్మకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.పూర్తి వివరాల్లోకి వెళ్తే ఉత్తర ప్రదేశ్‌కు చెందిన చింతహరణ్‌ చౌహాన్‌ అనే 66 ఏళ్ల వ్యక్తి 30 ఏళ్లుగా పెళ్లి కూతురు డ్రస్‌లోనే ఉంటున్నాడు.

అతడి కథ కమామీషుకు వెళ్తే ఆశ్చర్యపోక మానరు.

ఉత్తరప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి చింతరహరణ్‌ చౌహాన్‌.ఇతడు 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మొదటి పెళ్లి చేసుకున్నాడు.కొన్నాళ్లకే అతడి భార్య చనిపోయింది.

ఆ తర్వాత పశ్చిమబెంగాల్‌ వెళ్లి అక్కడ ఒక వ్యాపారి కూతురును ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.ఆమె కుటుంబంకు పెళ్లి ఇష్టం లేక పోవడంతో ఆమెను తల్లిదండ్రుల వద్ద వదిలి చౌహాన్‌ మళ్లీ యూపీకి తిరిగి వెళ్లాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

చౌహాన్‌ మోసం చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.ఆ విషయం చౌహాన్‌కు కొన్నాళ్ల తర్వాత తెలిసి చాలా బాధపడ్డాడు.

Advertisement

కొంత కాలంకు మూడవ పెళ్లి చేసుకున్నాడు.

చౌహాన్‌ కుటుంబ సభ్యులు ఒకొక్కరు చొప్పున కొన్ని నెలల గ్యాప్‌లోనే పది మందికి పైగా చనిపోయారు.ఒక రాత్రి చౌహాన్‌ రెండవ భార్య కలలోకి వచ్చి నీ కుటుంబ సభ్యులు చనిపోవడానికి కారణం నేనే అంటూ చెప్పింది.నన్ను మోసం చేసినందుకు వారిని చంపినట్లుగా కలలో చెప్పిందట.

ఇకపై ఎవరు చనిపోకుండా ఉండాలంటే నీ వెంట నేను ఉండేలా పెళ్లి కూతురు డ్రస్‌ వేసుకుని ఎప్పుడు ఉండాలని సూచించిందట.దాంతో అప్పటి నుండి చౌహాన్‌ పెళ్లి కూతురు డ్రస్‌ మాత్రమే వేసుకుంటున్నాడు.

అది కాకుండా మరే డ్రస్‌ వేసుకున్నా కూడా కుటుంబ సభ్యులు చనిపోతారని అతడు నమ్ముతున్నాడు.ఫన్నీగా ఉంది కదా, ఇతడు 30 ఏళ్లుగా చేస్తున్న ఈ పనికి కోపం కూడా వస్తుంది కదా.! .

తాజా వార్తలు