ఇసుక విషయంలో జగన్‌ కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయాయి.దాంతో భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులకు గురవుతున్నారు అనే విషయం తెల్సిందే.

తెలుగు దేశం పార్టీతో పాటు జనసేన మరియు ఇంకా ప్రజా సంఘాలు చాలా వరకు ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులను మీడియా ముందుకు తీసుకు వచ్చేందుకు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.ఉద్యమం తీవ్రతరం అవ్వడంతో పాటు పలువురు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇసుకను ఇకపై పక్క రాష్ట్రాలకు తరలించకుండా కీలక నిర్ణయం తీసుకుంది.ఏపీలో ఇసుక లారీ ఒక్కటి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లేందుకు వీలు లేదని ఇకపై టెంకెడు ఇసుక అయినా రాష్ట్రంలోనే వినియోగించాలంటూ జగన్‌ కీలన ఆదేశాలు జారీ చేశాడు.

ఏపీ నుండి ప్రతి రోజుకు దాదాపుగా వెయ్యి లారీల ఇసుక పక్క రాష్ట్రాలకు వెళ్తుందని, ఇకపై ఆ ఇసుక అంతా కూడా రాష్ట్రంలోనే వినియోగం అవ్వాల్సిందిగా సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.గత ప్రభుత్వంతో పోల్చితే తాము ఇసుకను చాలా తక్కువ రేటకు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లుగా సీఎం జగన్‌ అన్నారు.

Advertisement
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

తాజా వార్తలు