యంగ్ హీరో మంచు మనోజ్ గత కొంత కాలంగా ఫ్యామిలీ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా మీడియాలో వార్తలు వచ్చాయి.మంచు మనోజ్ తన భార్యకు విడాకులు ఇచ్చాడంటూ సంవత్సర కాలంగా వార్తలు వస్తున్నాయి.
మొదట మంచు మనోజ్ విడాకుల విషయమై పుకార్లు వచ్చిన సమయంలో వింతగా స్పందించాడు.ట్విట్టర్లో విడాకుల గురించి ప్రచారం చేస్తున్న వారిని ఉద్దేశించి ‘వారి బొంద’ అంటూ ట్వీట్ చేశాడు.
విడాకుల పుకార్లు ప్రచారం చేస్తున్న వారిపై సీరియస్ అయ్యాడు.
నా భార్య ప్రణతిని జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాను.
ఆమె నాకు భార్యగా లభించడం అదృష్టం.ఆమెతో ప్రస్తుతం తన జీవితం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశాడు.
అలా అంటూ ట్వీట్ చేసిన కొన్ని నెలలకే నా భార్యతో విడిపోయినట్లుగా స్వయంగా ఆయనే ప్రకటించాడు.కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆమెతో కలిసి ఉండలేక పోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
ఇద్దరి మద్య విభేదాలుకు కారణం ఏంటో అనే విషయమై క్లారిటీ అయితే లేదు.కాని మనోజ్ పాత ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

గతంలో మంచు మనోజ్ వారి బొంద అంటూ చేసిన ట్వీట్‌ను జనాలు రీ ట్వీట్ చేస్తూ అప్పుడు అలా అన్నావు కదా మరి ప్రణతికి ఎలా విడాకులు ఇచ్చావంటూ ప్రశ్నిస్తున్నారు.చాలా కాలం క్రితమే నీవు నీ భార్యతో విడాకులు తీసుకున్నావు.మరి అప్పుడు ఆ విషయాన్ని దాయాల్సిన అవసరం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.భార్యతో విడిపోయిన బాధలో ఉన్న మనోజ్‌ను ఇంకా బాధ పెట్టడం సరైనది కాదని, ఆయన్ను కాస్త ప్రశాంతంగా వదిలేయాలంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.