రావాలి ఎన్టీఆర్ కావాలి ఎన్టీఆర్ ! టీడీపీ కొత్త నినాదం ఇదేనా ?

సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పుట్టెడు కష్టాల్లో ఉంది.

తమ అనుభవం, రాజకీయ వ్యూహాలతో పార్టీని ముందుకు నడిపించిన సీనియర్ నాయకులంతా వయసు ప్రభావంతో ప్రస్తుతానికి పార్టీకి దూరంగా ఉంటున్నారు.

ఇక యువ నాయకుల్లో పార్టీ భవిష్యత్తు పై భరోసా కల్పించే వారూ కరువయ్యారు.అదీ కాకుండా ఏపీ లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టిడిపి అవమానకరమైన రీతిలో కేవలం 23 స్థానాలనే దక్కించుకోవడంతో పార్టీలో అభద్రతా భావం పెరిగిపోయింది.

అధినేత చంద్రబాబు నాయుడు రిటైర్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేయడంతో తిరిగి పార్టీకి పునర్వైభవం తీసుకు వచ్చే నాయకుల కోసం అంతా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో టిడిపిని సమర్థవంతంగా ముందుకు నడిపించగల వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ మాత్రమేనని పార్టీలోని నాయకులంతా ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

  తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అస్వస్థతకు గురవడం, అమెరికా వెళ్లి చికిత్స చేయించుకోవడంతో ఆయన రాజకీయాలకు ఇక దూరంగానే ఉంటారు అనే అభిప్రాయం నాయకుల్లో మొదలయ్యింది.అది కాకుండా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు మానసిక పరిస్థితిపై కూడా అందరికి సందేహాలు మొదలయ్యాయి.ఇటీవల వైసిపి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి, చంద్రబాబు గురించి వస్తున్న ట్రోలింగ్ పై స్వయంగా బాబు ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు.

Advertisement

అక్కడ సోషల్ మీడియా లో వచ్చిన పోస్టింగ్స్, కామెంట్స్ లో వచ్చిన బూతులను కూడా యథాతథంగా చదివి వినిపించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.చంద్రబాబు నోటి వెంట ఇటువంటి మాటలు విన్నవారంతా ఆయన మానసిక పరిస్థితిపై సందేహాలు వ్యక్తం చేశారు.

చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే ఆయన వారసుడు లోకేష్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

  ప్రస్తుతం ఆయన టిడిపి సోషల్ మీడియా విభాగాన్ని చూస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్లు చేసేవారు.కానీ ప్రస్తుతం అవి కూడా చేయకుండా సైలెంట్ గా ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో లోకేష్, చంద్రబాబు నాయుడు మీద నమ్మకం కోల్పోయిన కొంతమంది టిడిపి సీనియర్ నాయకులు జూనియర్ ఎన్టీఆర్ తో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది.ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు జూనియర్ టిడిపిలో యాక్టివ్ చేసినందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
నేటి ఎన్నికల ప్రచారం : బాబు అక్కడ .. జగన్ ఇక్కడ 

తెలుగుదేశం పార్టీ బతికి బట్ట కట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే దిక్కనే అభిప్రాయం కిందిస్థాయి కార్యకర్త ల నుంచి సామాన్య ప్రజల వరకు ఉంది.ఇక ఎన్టీఆర్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే విషయంలో తొందరపడకుండా ఆచి తూచి వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు