టాలీవుడ్‌కు ఆ విలన్‌ 600 కోట్ల ఖరీదైన దానం ఇచ్చాడు... మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ల కంటే గ్రేట్‌

టాలీవుడ్‌ ఒకప్పుడు చెన్నైలో ఉండేది.అక్కడ నుండి హైదరాబాద్‌కు తరలించేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరిగాయి.

 Actor Prabhakar Reddy Donates 600 Crore Property To Film Industry-TeluguStop.com

హైదరాబాద్‌లో ప్రభుత్వం దాదాపుగా ఉచింగానే భూములను ఇచ్చింది.దాంతో రామానాయుడు, నాగేశ్వరరావు వంటి వారు హైదరాబాద్‌లో స్టూడియోలు నిర్మించారు.

ఇంకా ఎంతో మంది కూడా అప్పట్లో హైదరాబాద్‌లో భూములు కొనుగోలు చేశారు.హైదరాబాద్‌కు ఇండస్ట్రీ రాని సమయంలో ఇక్కడ భూమల రేట్లు పాతాలంలో ఉండేవి.

ప్రస్తుతం ఖరీదైన గచ్చిబౌళి ఏరియాలో పాతిక ఏళ్ల క్రితం కేవలం లక్షలు, వేలల్లోనే ఉండేవి.

హైదరాబాద్‌లో టాలీవుడ్‌ అభివృద్ది కోసం ఒకొక్కరు ఒక్కో విధంగా సాయం చేశారు.1970 లలో తెలుగు సినిమాల్లో విలన్‌ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే నటుడు ప్రభాకర్‌ రెడ్డి.ఎన్నో అద్బుతమైన పాత్రలను పోషించిన ప్రభాకర్‌ రెడ్డి బాగానే సంపాదించే వారు.హైదరాబాద్‌లో అప్పట్లోనే ఆయన 10 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు.ఆ భూమి హైదరాబాద్‌లో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్దికి అంటూ ఇచ్చారు.ఇప్పుడు ఆ భూమి విలువ 600 కోట్లు.

తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ది కోసం ఆ భూమిలో చిత్రపురి కాలనీ ఏర్పాటు చేశారు.

అప్పటి ప్రభుత్వం ప్రభాకర్‌ రెడ్డి ఇచ్చిన 10 ఎకరాల భూమితో పాటు మరో 20 ఎకరాల భూమి ఇవ్వడంతో చిత్రపురి కాలనీ ఏర్పాటు అయ్యింది.హైదరాబాద్‌ అభివృద్ది వేగంగా జరుగుతున్న ఈ సమయంలో అప్పట్లో కొండలు గుట్టలుగా మాత్రమే ఉన్న చిత్రపురి కాలనీ ఇప్పుడు బంగ్లాలతో నిండిపోయింది.అద్బుతమైన డెవలప్‌మెంట్‌ జరిగింది.టాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్స్‌ ఉన్నారు, కోట్లు సంపాదించే వారు ఉన్నారు.కాని వారెవ్వరు కూడా ప్రభాకర్‌ రెడ్డి స్థాయిలో టాలీవుడ్‌కు సాయం చేసింది లేదు.అందుకే మెగాస్టార్‌, సూపర్‌ స్టార్‌ల కంటే ప్రభాకర్‌ రెడ్డి గొప్ప వారు అనడంలో ఎలాంటి సందేహం లేదు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube