కాలిఫోర్నియా : ఇకపై ప్రిస్క్రిప్షన్ లేకుండానే హెచ్ఐవీ మందులు కొనుక్కోవచ్చు

కాలిఫోర్నియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది.హెచ్ఐవీ రోగులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా హెచ్ఐవీ నిరోధక మాత్రలను కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.

ఈ మేరకు చట్టసభ ఆమోదించిన సెనేట్ బిల్ 159పై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసోమ్ సోమవారం సంతకం చేశారు.ప్రిస్క్రిప్షన్లు లేకుండా ప్రీ-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ (ప్రిఇపి), మరియు పోస్ట్-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ (పిఇపి) కు అనుమతించిన తొలి రాష్ట్రం కాలిఫోర్నియా అని సెనేట్ బిల్ 159 యొక్క న్యాయవాదులు తెలిపారు.

ప్రీ-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనేది హెచ్ఐవీ నెగెటివ్ వ్యక్తులు రోజువారీ వేసుకోవాల్సిన మాత్ర.అయితే పోస్ట్-ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అనేది వైరస్ సంక్రమించకుండా ప్రజలు ముందుగా వేసుకునే మాత్ర.

కాలిఫోర్నియా హెల్త్ బెనిఫిట్స్ రివ్యూ ప్రోగ్రాం ప్రకారం కాలిఫోర్నియాలో దాదాపు 30,000 మంది ప్రజలు ప్రిఇపిని మరియు 6,000 మంది పిఇపిని ఉపయోగిస్తున్నారు.కాలిఫోర్నియా మెడికల్ అసోసియేషన్ మొదట్లో ఈ చట్టాన్ని వ్యతిరేకించింది.అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా రోగులు ప్రిఇపి మాత్రలను 60 రోజుల వరకు పొందగలిగేలా చట్టసభ సవరణ చేయడంతో అసోసియేషన్ తటస్థ వైఖరిని అవలంభించింది.

Advertisement

ఇదే క్రమంలో ఇన్సూరెన్స్ ద్వారా మందులను కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి కావాలన్న బీమా కంపెనీల నిబంధనను సైతం సెనేట్ బిల్ 159 తొలగించింది.కాగా మెడికల్ ఫార్మాసిస్ట్‌లు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అత్యవసర గర్భనిరోధక మాత్రలు మరియు జనాభా నియంత్రణ మందులను విక్రయించడానికి గతంలోనే కాలిఫోర్నియా ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??
Advertisement

తాజా వార్తలు