డెడ్‌లైన్‌ ఓవర్‌ : కొనసాగుతున్న ఉత్కంఠ, ఢీ అంటే ఢీ

తెలగాణ ప్రభుత్వం మరియు ఆర్టీసీ కార్మికులకు మద్య జరుగుతున్న తీవ్రమైన వాద ప్రతివాదాలు నడుస్తున్నాయి.

తమ డిమాండ్లకు ఒప్పుకునే వరకు బస్సు ఎక్కేది లేదు, బస్సు కదిలేది లేదు అంటూ నేటి నుండి సమ్మెకు దిగిన ఆర్టీసి అందరు కార్మికులు తమ పట్టును వదలడం లేదు.

నేడు సాయంత్రం ఆరు గంటల వరకు డ్యూటీలో జాయిన్‌ కాకుంటే సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్యోగాల నుండి తొలగించేందుకు ఆదేశాలు జారీ చేస్తామంటూ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది.ప్రభుత్వ ప్రకటనతో కొందరు ఉద్యోగులు అయినా భయపడి సమ్మెను వదిలేసి విధుల్లో జాయిన్‌ అవుతారేమో అనుకున్నారు.

కాని ఏ ఒక్కరు కూడా విధులకు హాజరు కాలేదు.జాబ్‌ల నుండి తొలగిస్తే నిరాహార దీక్షలు చేసేందుకు కూడా సిద్దం అవుతున్నారు.

మరో వైపు రేపు కీలక నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి మీటింగ్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో అసలేం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

పరిణామాలు చూస్తుంటే ఆర్టీసిని ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కొందరు అనుకుంటున్నారు.అసలేం జరుగనుంది అనేది రేపటి మద్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు