ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆ మాజీ సీఎం ?

బీజేపీ ఏపీలో బలం పెంచుకునేందుకు చేయని ప్రయత్నమే లేదు.సాధారణంగా దక్షణాది రాష్ట్రాల్లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపించరు.

ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో ఈ పార్టీకి ఆదరణ అంతంత మాత్రంగానే ఉంటూ వస్తోంది.ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకుంటే తప్ప ఒంటిరిగా పోటీ చేస్తే ఆ పార్టీకి ఒకటి రెండు సీట్లు రావడమే కష్టమన్నట్టుగా పరిస్థితి ఉంటోంది.

ఈ నేపథ్యంలో ఆ పరిస్థితిని మార్చి తమకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకునేందుకు బీజేపీ అన్నిరకాలుగా ప్రయత్నిస్తోంది.దీనిలో భాగంగానే ఆఫరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది.

ఏపీ విషయంలో చూస్తే ఇక్కడ చిన్న చితకా నాయకులు తప్ప రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న నాయకులు మాత్రం ఆ పార్టీలోకి రావడం లేదు.అందుకే ఇప్పుడు రాష్ట్ర స్థాయి నాయకుల చేరికలపై బీజేపీ అధిష్టానం గురి పెట్టింది.

Advertisement

ఈ క్రమంలోనే ఏపీ విభజనతో కనుమరుగైన బలమైన కాంగ్రెస్ నాయకులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.వీరి ద్వారా ఏపీ బీజేపీని మరింత పటిష్టం చేయాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్టు కనిపిస్తోంది.

  ఇప్పటికే ఏపీ టీడీపీ పరిస్థితి దారుణంగా తయారయ్యింది.ఆ పార్టీ మొన్నటివరకు అధికారంలో ఉంది చక్రం తిప్పినా ప్రస్తుతం జగన్ ప్రభుత్వాన్ని చూసి ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు.తమపై ఎక్కడ రాజకీయ కక్ష తీర్చుకుంటారో అనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది.

ఇక అధికార పార్టీలోనూ కొంతమంది ఆ పార్టీ అధిష్టానం పై గుర్రుగా ఉన్నారు.జగన్ తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడంలేదని, పట్టించుకోవడంలేదని అసంతృప్తితో ఉన్నారు.ఇటువంటి అసంతృప్తిగా ఉన్న నేతలపై కూడా బీజేపీ ఓ కన్నేసినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా టీడీపీ నుంచి బీజేపీలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులకు ఇప్పుడు టీడీపీ నుంచి వలసలు ప్రోత్సహించాలని బీజేపీ అధిష్టానం సూచించిందట.ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితోపాటు అప్పటి కాంగ్రెస్ హయాంలో వెలుగు వెలిగిన పల్లం రాజు, చింతా మోహన్ లాంటి సీనియర్లను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయట.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
రాజధానిపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు..!!

  ఇప్పటికే కడప జిల్లా కు చెందిన సీనియర్ నాయకుడు, తెలుగుదేశంలో మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి ఇప్పటికే బీజేపీలో చేరుతానని ప్రకటించారు.బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.ఈయనతోపాటు కడప జిల్లా కు చెందిన మాజీ ఎమ్మెల్యేలను కూడా బీజేపీలో చేర్చించేందుకు ఎంపీ సీఎం రమేష్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

Advertisement

ఇక ఏపీ బీజేపీ బాధ్యతలను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి అప్పగించి ఉమ్మడి ఏపీలో వెలుగు వెలిగిన కాంగ్రెస్ నేతలను బీజేపీలో చేర్చించే బాధ్యతలను కూడా కిరణ్ కుమార్ రెడ్డికే అప్పగించాలని బీజేపీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది.ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా చేసిన అనుభవం, పరిచయాలు తమ పార్టీకి బాగా కలిసి వస్తాయనే ఉద్దేశం బీజేపీలో కనిపిస్తోంది.

అందుకే కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీ బీజేపీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది.

తాజా వార్తలు