ఉత్తమ్ కుమార్ రెడ్డి గత ఏడాది చివర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి పోటీ చేసి శానంపూడి సైదిరెడ్డిపై గెలిచిన విషయం తెల్సిందే.ఆ ఎన్నికలు జరిగిన మూడు నాలుగు నెలల్లోనే ఉత్తమ్ ఎంపీగా పోటీ చేశాడు.
నల్లగొండ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయాన్ని అందుకున్నాడు.దాంతో అసెంబ్లీ స్థానంకు రాజీనామా చేయడం జరిగింది.
దాంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నికలు రాబోతున్నాయి.ఆ ఉప ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి.
ఇప్పటి వరకు టీఆర్ఎస్ మరియు ప్రతిపక్ష కాంగ్రెస్‌లు మాత్రమే ఈ స్థానం కోసం ఢీ కొట్టబోతున్నాయని అనుకున్నాం.కాని బీజేపీ ఈ ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చబోతుంది.
అక్కడ ఎవరో అనామక క్యాండిడేట్‌ను పోటీ చేయిస్తే పెద్దగా ప్రచారం జరిగేది కాదు.కాని రాష్ట్ర సీనియర్ నాయకుడిని బీజేపీ అక్కడ పోటీ చేయించే అవకాశం ఉంది.
ఈ విషయమై అతి త్వరలోనే వెళ్లడి కాబోతుంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ హుజూర్ నగర్లో పోటీ చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
గెలుపు కోసం బీజేపీ తీవ్రంగా ప్రయత్నించబోతుంది.ప్రముఖ కేంద్ర మంత్రులను హుజూర్ నగర్ ఎన్నికల ప్రచారంలో దించబోతున్నారు.
అక్కడ బీజేపీ గెలిస్తే సంచలనమే.!