పీఓకేలో ఇమ్రాన్‌ఖాన్‌కు చేదు అనుభవం

ఇన్నాళ్లుగా జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఉండడంతో పాక్‌ చాలా స్పేచ్ఛగా పీఏకేలో అధికారాన్ని చలాయించేది.

కానీ భాజాపా ప్రభుత్వం కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాకు సంబంధించిన 370 ఆర్టికల్‌ను రద్దు చేస్తూ పాక్‌ కు షాకిచ్చింది.

దాంతో పీఏకేలో పాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి.పీఓకేలో ముజఫరాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరు అవడానికి వచ్చిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది.

పీఓకే ప్రజలు తనకు ఘన స్వాగతం పలుకుతారని ఆశించిన ఇమ్రాన్‌కు ఘాటుగా నిరసనలు తెలిపారు.బిగ్‌ జల్సా ర్యాలీలో పాల్గొంనేందుకు వచ్చిన ఇమ్రాన్‌ కు ముజఫరాబాద్‌లోని ప్రజలు చెమటలు పట్టించారు.

గో బ్యాక్‌ నాజీ అంటూ ప్లకార్డులు చూపారు.అంతేకాకుండా కశ్మీర్‌ హిందూస్థాన్‌ సొంతం అంటూ నినాదాలు చేశారు.

Advertisement

దీంతో పాటు పలువురు బీజేపీ నేతలు ఇటీవల పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను ఎలా సొంతం చేసుకోవాలో తమకు ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయంటూ ఇమ్రాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.దాంతో పాక్‌ ప్రభుత్వం అయోమయంలో పడినట్టుగా సమాచారం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు