ఆదర్శం : ఈ యువ రైతును ప్రతి ఒక్క నిరుద్యోగ యువకుడు ఫాలో అవ్వాలి

ఎంత చదివినా కూడా ఉద్యోగం రాని వారు, చేస్తున్న ఉద్యోగంలో సంతృప్తి లేని వారు చాలా మంది తమకున్న వ్యవసాయంను చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఈమద్య కాలంలో చాలా మంది టెక్కీలు మరియు ఇతర రంగాలకు చెందిన ఉన్నత స్థాయి ఉద్యోగస్తులు వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్న విషయం తెల్సిందే.

చాలా మందిలాగే హర్యానాకు చెందిన దర్శన్‌ సింగ్‌ కూడా చదువుకున్న చదువు ఉద్యోగం తెచ్చి పెట్టక పోవడంతో ఇక తన తండ్రికి ఉన్న వ్యవసాయంను చేయాలని భావించాడు.చదువుకునే సమయంలోనే తండ్రికి సాయం చేస్తూ వ్యవసాయ పనులు అలవాటు చేసుకున్నాడు.

  తనకు వచ్చిన వ్యవసాయంను చేయాలని నిర్ణయించుకున్న దర్శన్‌కు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి.వ్యవసాయం అనుకున్నంత లాభసాటిగా లేదు.ప్రతిదానికి కూడా కూలీలు, ఇంకా పలు రకాల కారణాల వల్ల పెట్టుబడి ఎక్కువ ఉంది, రాబడి తక్కువ ఉంది.

దాంతో దర్శన్‌ సైడ్‌ ఇన్‌కం అన్నట్లుగా ఒక యూట్యూబ్‌ ఛానెల్‌ను స్టార్ట్‌ చేయడం జరిగింది.యూట్యూబ్‌లో తాను తన పంట పొలంలో చేసే పనులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ రైతులు మరియు వ్యవసాయ శాఖ చేపట్టిన కార్యక్రమాలను తన యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తూ ఉండేవాడు.

Advertisement

మొదట ఈయన ఛానెల్‌కు ఆధరణ అంతగా దక్కలేదు.కాని నెల రోజుల తర్వాత అనూహ్యంగా ఆయన ఫాలోవర్స్‌ పెరిగారు.యూట్యూబ్‌లో అనేక రకాల వీడియోలు పోస్ట్‌ చేస్తూ ఉండటం వల్ల ఆయన్ను సబ్‌స్క్రైబ్‌ చేసుకునే వారి సంఖ్య వేల నుండి లక్షలకు పెరిగింది.

ఆయన చేసిన ప్రతి వీడియోకు వేలల్లో వ్యూస్‌ లైక్స్‌ రావడం మొదలు అయ్యాయి.కేవలం వ్యవసాయంకు సంబంధించిన వీడియోలు మాత్రమే కాకుండా అవైర్‌నెస్‌ వీడియోలు ఇంకా డొమెస్టిక్‌ యానిమల్స్‌కు సంబంధింన వీడియోలను ఈయన ఎక్కువగా పోస్ట్‌ చేయడం మొదలు పెట్టాడు.

ఎక్కడ వ్యవసాయ కార్యక్రమం జరుగుతున్నా కూడా వెళ్లడం ఈయన అలవాటు చేసుకున్నాడు.ప్రస్తుతం అతడి ఆదాయం నెలకు రెండున్నర లక్షలకు పైగా ఉందని సమాచారం.

  మొదట్లో మొత్తం మొబైల్‌లోనే వీడియో తీయడం, ఎడిట్‌ చేయడం, అప్‌లోడ్‌ చేయడం చేసేవాడు.కాని ఇప్పుడు ఒక పెద్ద కెమెరా కొనడంతో పాటు కంప్యూటర్‌లో ఎడిటింగ్‌ చేస్తున్నాడట.దానికి తోడు తన వీడియోల మేకింగ్‌ కోసం ఒకరు ఇద్దరిని కూడా తన కింద ఉద్యోగులుగా పెట్టుకున్నాడట.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..

ఇదంతా చేస్తూ కూడా అతడు తన భూమిలో వ్యవసాయం చేస్తూనే ఉన్నాడు.దర్శన్‌ సింగ్‌లా ఎంతో మంది యువత ఇలాంటి వినూత్న ప్రయోగాలు చేస్తూ అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

ప్రతి పనిలో కూడా వంద శాతం పెట్టాలి.అయితే అందులో ఎక్కువ వర్త్‌ లేదనిపించినప్పుడు, అడుగు ముందుకు వేయాలని భావించినప్పుడు ఖచ్చితంగా కష్టపడాలి.అప్పుడే అనుకున్న లక్ష్యాలను చేరుకోవడం జరుగుతుంది.

వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ ఉంటే దర్శన్‌ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.కాని ఇప్పుడు ఆయన ఉత్తర భారతదేశంలో చాలా ఫేమస్‌ అయ్యాడు.

ఆయన వీడియోలను లక్షల్లో జనాలు చూస్తున్నారు.అందుకే సాధించాలి, చేయాలనే పట్టుదల ఉంటే ఏదో ఒక మార్గం మనకోసం ఓపెన్‌ అయ్యి ఉంటుంది.

దాన్ని మనం వెదికి పట్టుకోవాలి.దీన్ని మీరు నమ్మినట్లయితే తప్పకుండా మీ స్నేహితులతో ఈ విషయాన్ని షేర్‌ చేసుకోండి.

తాజా వార్తలు