అమెరికాలోని తెలుగు సంఘాలలో తానాకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.తాము ఎటువంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినా సరే ఎంతో మందికి స్పూర్తిదాయంకగా ఉండేలా రూపకల్పన చేస్తారు.
తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలని గౌరవిస్తూ, తెలుగుని తమ తరాల వారికి తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ, వైద్య సలహాలు, సూచనలు, మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ ఒకటి కాదు రెండు కాదు వివిధ రకాలుగా తమ సేవాకార్యక్రమాలని ప్రజలలోకి తీసుకువెళ్ళేలా రూప కల్పన చేస్తారు.

ఈ క్రమంలోనే తాజాగా తానా టీం సభ్యులు ఆరోగ్య నడక పేరుతో మిషన్ పీక్స్ హైకింగ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.తానా వెస్ట్ టీమ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించ బడింది.తానా జాయింట్ ట్రెజరర్ కోగంటి వెంకట్, తానా రీజనల్ కో ఆర్డినేటర్ రజనీకాంత్ కాకర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తానా వెస్ట్ టీమ్ నాయకులు మాట్లాడుతూ.
ఈ ఆరోగ్య నడక మిషన్ పీక్స్ హైకింగ్ కార్యక్రమం సుమారు 8 వారలా పాటు జరుగుతుందని, ఇప్పటికే 3 వారాలు దిగ్విజంగా నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమం శరీరానికి మంచి ఆరోగ్యాన్ని, ధృడత్వాన్ని ఇస్తుందని, శరీరం ఎంతో హాయిగా ఉంటుందని.కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు తెలిపారు.







