అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని వదిలి వెళ్లడంతో ఆమెను ఆమె కూతురు జాన్వీ కపూర్‌లో అభిమానులు చూసుకుంటున్నారు.జూనియర్ శ్రీదేవి అంటూ అంతా ఆమెను అంటూ ఉంటారు.
శ్రీదేవి పోలికలు ఉండటంతో పాటు, శ్రీదేవి మాదిరిగా ఎక్కువ అలవాట్లను ఇష్టాలను జాన్వీ కలిగి ఉంది.ఇక స్క్రీన్‌పై కనిపించే సమయంలో కూడా జాన్వీ కపూర్ ఎక్కువగా శ్రీదేవి తరహాలోనే కనిపిస్తుంది.
తల్లికి తగ్గ కూతురు అనిపించుకునేందుకు జాన్వీ కపూర్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది.

శ్రీదేవి బతికి ఉన్న సమయంలో ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానంను దర్శించేవారు.ఆమె చనిపోయిన తర్వాత జాన్వీ కపూర్ కూడా తిరుపతి వస్తున్నారు.గతంలో తల్లితో కలిసి వచ్చిన జాన్వీ ఇప్పుడు ఒంటరిగా లేదంటే తండ్రి బోణీ కపూర్‌తో కలిసి వస్తోంది.
తనకు సౌత్ ఇండియా ముఖ్యంగా తమిళనాడు, తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక అభిమానం ఉంటుందని జాన్వీ కపూర్ గతంలో చెప్పుకొచ్చింది.ఇక తాజాగా తన పెళ్లి విషయంలో కూడా తన సౌత్ ప్రేమను జాన్వీ కపూర్ చూపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
పెళ్లిపై ఈమె ప్లానింగ్స్‌ను తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

జాన్వీ కపూర్ మాట్లాడుతూ.నా పెళ్లి ఖచ్చితంగా తిరుపతిలో జరుగుతుందని అందరికి తెలుసు.నా పెళ్లికి నేను కంచి పట్టు చీర కట్టుకోవడంతో పాటు, తమిళనాడు సాంబారు ఇండ్లీ మరియు ఇంకా సౌత్ వంటకాలను రుచి చూసుకుంటూ చేసుకుంటాను.
నా పెళ్లికి వచ్చిన గెస్ట్‌లు కూడా తప్పకుండా సౌత్ వంటకాలు తినేలా చూస్తాను అంది.ఇక తాను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి మంచి తెలివి కలిగిన వ్యక్తి అయ్యి ఉండాలంది.
నేను ఏది అడిగినా ఆయన వద్ద సమాధానం ఉండాలి.నన్ను నవ్వించడంతో పాటు, నన్ను మంచిగా చూసుకునే వ్యక్తి అయ్యి ఉండాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది.